కాసిపేట (ఆదిలాబాద్) : జీవితంపై విరక్తి చెందిన ఓ వివాహిత బలవన్మరణం చెందింది. ఆదిలాబాద్ జిల్లా కాసిపేట మండలం తుమ్మగూడెం తండాకు చెందిన బానోతు గోపాల్ భార్య మీనాక్షి (22) రెండు నెలల క్రితం ఒక బిడ్డకు జన్మనిచ్చింది. కాగా పసికందు కొద్దిరోజులకే మృతిచెందింది. అప్పటి నుంచి మీనాక్షి తీవ్ర మనోవేదనతో ఉంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యులు గమనించేసరికే ఆమె చనిపోయింది.