5 నెలల పసికందు సహా తల్లి ఆత్మహత్య | woman commits suicide with 5 months old daughter | Sakshi
Sakshi News home page

5 నెలల పసికందు సహా తల్లి ఆత్మహత్య

Published Mon, Nov 9 2015 10:34 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

woman commits suicide with 5 months old daughter

దేవరకద్ర: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన వివాహిత తన ఐదు నెలల చిన్నారితో సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం నాగారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మల్లమ్మకు (22) మణికొండకు చెందిన వ్యక్తితో మూడేళ్ల క్రితం పెళైంది. వీరికి ఐదునెలల పాప ఉంది.

పండుగ కోసం తల్లి గారింటికి వచ్చిన మల్లమ్మ తిరిగి భర్త దగ్గరకు వెళ్లకపోవడంతో కుటుంబంలో తగాదాలు తలెత్తాయి. దీంతో మనస్తాపం చెందిన మల్లమ్మ తన పాపతో సహా ఆదివారం రాత్రి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement