ఆస్తికోసం పినతల్లి దారుణహత్య | woman died in nalgonda district | Sakshi
Sakshi News home page

ఆస్తికోసం పినతల్లి దారుణహత్య

Published Mon, Jan 5 2015 2:55 AM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM

ఆస్తికోసం పినతల్లి దారుణహత్య - Sakshi

ఆస్తికోసం పినతల్లి దారుణహత్య

ఆమనగల్లు (వేములపల్లి) : ఆస్తికోసం పిన తల్లి(తండ్రి రెండో భార్య)ని తనయుడు దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన మండలంలోని ఆమనగల్లు గ్రామపంచాయతీ పరి ధిలో గల లక్ష్మీదేవిగూడెం శివారులో వెలుగు చూసిం ది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన బంటు బుచ్చయ్యగౌడ్ మొదటి భార్య సుగుణమ్మ 30 సంవత్సరాల క్రితం మరణించింది. దాంతో అదే గ్రామానికి చెందిన లక్ష్మమ్మను వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య సుగుణమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండో భార్య లక్ష్మమ్మకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా బుచ్చయ్య తనకున్న 2.10 ఎకరాల భూమిని ఇద్దరు కుమారులకు 1.05 ఎకరాల చొప్పున పంపకాలు చేశాడు. వీరిలో పెద్ద కుమారుడు వెంకన్న ఎలాంటి పనులు చేయకుండా తిరుగుతుండే వాడు.
 
 దీంతో అతడు గ్రామంలో కొందరి వద్ద అప్పులు చేశాడు. అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో తనపేర ఉన్న 1.05 ఎకరాల భూమిని అమ్మేందుకు సిద్ధపడ్డాడు. ఈ క్రమంలో తండ్రి బుచ్చయ్య, పినతల్లి లక్ష్మమ్మలు అడ్డుచెప్పారు. దీంతో వెంకన్న వారిపై కక్ష పెంచుకున్నాడు. అతడు శనివారం తండ్రి బుచ్చయ్యకు ఫోన్ చేసి తీవ్ర వాగ్వాదం చేశాడు. రోజూ మాదిరిగానే లక్ష్మీదేవిగూడెం గ్రామ శివారులోని మూసీవాగు సమీపంలో గల తన కుమార్తె పొలం వద్దకు బుచ్చయ్య తన రెండో భార్య లక్ష్మమ్మతో కలసి వెళ్లాడు. బుచ్చయ్య సాయంత్రం వేళ మోటార్ వద్ద మరమ్మతులు చూసుకొని ఇంటికి వెళ్లే క్రమంలో భార్య లక్ష్మమ్మ కోసం వెతికాడు. కానీ లక్ష్మమ్మ కనిపించకపోవడంతో ఇంటికి వెళ్లిఉండవచ్చని భావించాడు. బుచ్చయ్య కూడా ఇంటికి వెళ్లిపోయాడు.
 
 రాత్రి వరకు కూడా లక్ష్మమ్మ ఆచూకీ తెలియకపోవడంతో ఇరుగు పొరుగు వారి సహాయంతో పొలం వద్దకు వెళ్లి మళ్లీ వెతికారు. అయినా ఫలితం లేకుండాపోయింది. ఆదివారం ఉదయం తిరిగి పొలం వద్దకు వెళ్లి వెతుకుతుండగా వంటిపై తీవ్ర కత్తిగాయాలతో మృతి చెంది కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంకన్న తన ఇంటికి తాళం వేసి భార్య, పిల్లలతో పరారయ్యాడు. సంఘటనా స్థలానికి మిర్యాలగూడ రూరల్ సీఐ కోట్ల నర్సింహారెడ్డి, వేములపల్లి ఎస్‌ఐ సతీష్‌కుమార్‌లు చేరుకొని విచారణ జరిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి త రలించారు. మృతురాలి భర బుచ్చయ్యగౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నర్సింహారెడ్డి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement