అప్పుల బాధతాళలేక మహిళా రైతు బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం మాదాపురంలో బుధవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన రామవాత్ ద్వాలి(44) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో పంట కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో.. అవి తీర్చే దారి కానరాక బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.