బంజారాహిల్స్ : పిల్లలను స్కూల్‌కు పంపకుండా.. వారిపట్ల జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నావని తిట్టిన భర్తపై అలిగి ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి అదృశ్యమైన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం వెలుగుచూసింది. బాధితుడు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్‌లోని బద్దం బాల్‌రెడ్డినగర్‌లో నివసించే జి.వెంకటేశ్ అపోలో ఆస్పత్రిలో లాండ్రీ పని చేస్తుంటాడు.ఆయన భార్య సుదీప్తి అలియాస్ బుజ్జి(26) గృహిణి. కాగా ఆమె ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. మూడో కొడుకు ఇంట్లోనే ఉంటున్నాడు.
అయితే కొద్దిరోజుల నుంచి పిల్లలను స్కూల్‌కు పంపడంలో నిర్లక్ష్యాన్ని కనబరుస్తుండడతో వెంకటేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో సుదీప్తి గత నెల 30న తన కూతురు దివ్యశ్రీ(8), సంతోష్‌కుమార్(6),సాయికుమార్(4)లను తీసుకుని రూ.15వేల నగదుతో సహా ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయింది.దీంతో వెంకటేశ్ తన స్వగ్రామమైన నల్గొండ జిల్లా ఆత్మకూరు మండలం కొరిటికల్ గ్రామంతో సహా అన్ని ప్రాంతాలు గాలించినా భార్య ఆచూకీ దొరకలేదు.దాంతో తన భార్య పిల్లలు కనిపించడం లేదంటూ గురువారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు గాలింపు చేపట్టారు.
భర్త తిట్టాడని..
Published Thu, Nov 26 2015 6:45 PM | Last Updated on Sun, Sep 3 2017 1:04 PM
Advertisement
Advertisement