
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, వరంగల్ : వివాహేతర సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్న భర్తకు ఓ భార్య చుక్కలు చూపించింది. ఇరుగుపొరుగు మహిళల సహకారంతో అతన్ని చితకబాదింది. ఈ ఘటన వరంగల్ పట్టణంలోని శివనగర్‌లో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. మూడేళ్లుగా భార్యకు దూరంగా ఉంటూ వేరే మహిళతో సహజీవనం చేస్తున్న ముత్తోజు రవికి తగిన బుద్ధి చెప్పాలని అతని భార్య సరిత నిశ్చయించుకుంది. రవి ప్రియురాలితో కలిసి ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేసింది. ఆమెతోపాటు తోటి మహిళలు కూడా రవికి, అతనితోపాటు సదరు మహిళను చితకబాదారు. రవి, అతని ప్రియురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment