కొత్తగూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం పెనగడప వద్ద గురువారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న రెండు టిప్పర్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చంద్ర గుండ మండలం అయ్యన్నపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళ మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రెండు టిప్పర్లు ఢీ..మహిళ మృతి
Published Thu, Oct 1 2015 9:47 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement