
సాక్షి, హైదరాబాద్ : సృష్టికి స్త్రీ ఆయువుపట్టు, ఆమె లేకుంటే మానవ మనుగడకే ముప్పు అని గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు వి.మమత ఉద్ఘాటించారు. మహిళలు వంటింటి పాత్రకే పరిమితం కాకుండా ధైర్యంగా, సమష్టిగా ఉండి సమాజసేవకు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. బుధవారం తెలంగాణ గెజిటెడ్ భవన్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి.
ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళా దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని, మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని, రాష్ట్రాభివృద్ధిలో మహిళలు కీలక భాగస్వామ్యం నెలకొల్పాలని ఆకాంక్షించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న టీజీవోస్ చైర్మన్ వి.శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ సాధనలో మహిళల పాత్ర ఎంతో ఉందని, వారు రాజకీయంగా ఇంకా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు సుజాత, సబిత, విజయలక్ష్మి, సునీత జోషి, హేమానళిని, విజయభారతి, కె.పద్మ, సంధ్య, పద్మజ్యోతి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment