కేంద్రంపై పోరుకు కార్మికులు సిద్ధం కావాలి | workers get ready to fighting on central | Sakshi
Sakshi News home page

కేంద్రంపై పోరుకు కార్మికులు సిద్ధం కావాలి

Published Wed, Nov 19 2014 2:10 AM | Last Updated on Sat, Sep 2 2017 4:41 PM

workers get ready to fighting on central

ఖమ్మం జెడ్పీసెంటర్: కేంద్రప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని, కేంద్రంపై పోరాడేందుకు కార్మికులు సిద్ధం కావాలని కార్మిక ఐక్య సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పలు సంఘాల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో కార్మిక చట్టాల సవరణలను వ్యతిరేకిస్తూ సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు శింగు నర్సింహారావు, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎస్‌కె. ముక్తర్‌పాషా, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి జి.రామయ్య, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షులు జలీల్, జిల్లా నాయకులు హనుమంతరెడ్డిలు మాట్లాడారు. దేశ సంపదను సృష్టిస్తున్న కార్మికుల పొట్టకొట్టి కార్పొరేట్ కంపెనీలకు మేలు చేస్తున్న మోడీ సంస్కరణాలను తిప్పికొట్టాలన్నారు.

ధరలు పెంచి, సంక్షేమ కార్యక్రమాల్లో కోత విధించి కార్మికుల జీవితాలను ఛిద్రం చేస్తున్న కేంద్రప్రభుత్వ చర్యలపై సమరశంఖం పూరించాలని పిలుపుని చ్చారు. విష్ణువర్ధన్, మేకలసంగయ్య,వీరభద్రం, విజయ్‌కుమార్, నున్నామాధవరావు, వెంకటనారాయణల అధ్యక్షతన జరిగిన సదస్సులో నాయకులు గణపతి, సాంబశివరావు, వేణుగోపాల్, కుమారి, శ్రీనివాసరావు,అంజిరెడ్డి, క్లైమెంట్, సీతామహలక్ష్మి, రామారావు, వెంకటేశ్వర్లు, సత్యం, రమణకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement