నిజాం షుగర్స్ పునరుద్ధరణ హామీ ఏమైంది?
తెలంగాణ వైఎస్సార్‌సీపీ ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక నిజాం షుగర్స్‌ను పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీ అమలు ఏమైందని సీఎం కేసీఆర్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ ప్రశ్నించింది. పునరుద్ధరణ సంగతేమోకాని టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర లోపే బోధన్, మెట్‌పల్లి, మెదక్‌లలోని నడుస్తు న్న యూనిట్లు పూర్తిగా మూతపడి కార్మికుల తో పాటు వేలాది మంది రైతులు రోడ్డున పడ్డారని ధ్వజమెత్తింది. తమ కుటుంబాలను పోషించలేక కొంత మంది కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బోరుునపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ ఫ్యాక్టరీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని విజయవంతంగా నడుపుతుందని ఆశపడ్డ రైతులకు, కార్మికులకు చేదు అనుభవం ఎదు రైందన్నారు.
అంతే కాకుండా ప్రభుత్వానికి గోకరాజు గంగరాజు రూ.10 కోట్లు చెల్లించి మూడు యూనిట్లను సొంతం చేసుకుని లాభపడ్డారన్నారు. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లించకుండా ఫ్యాక్టరీని మూసివే యడంతో కార్మికులు, రైతులతో పాటు పరిశ్ర మపై పరోక్షంగా ఆధారపడిన వివిధ రంగాల వారు ఉపాధిని కోల్పోయారన్నారు. ఎన్‌డీఎస్ ఎల్ ఫ్యాక్టరీ మూసివేత నాటికి ఉన్న రైతుల బకారుులు చెల్లించడంలో ప్రభుత్వం చొరవ చూపిన ట్లే, కార్మికులకు చెల్లించా ల్సిన 11 నెలల వేతన బకారుులను ఇప్పించాల న్నారు. నిజాం షుగర్స్‌ను తెరిపించాలని, చెరుకు అధికంగా పండే ప్రాంతంలో చెరుకు పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.