సాక్షి, యాదాద్రి /యాదగిరికొండ: యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన తిరుకల్యాణోత్సవం వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 11 గంటలకు బాలాలయంలో స్వామి, అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం జరుగుతుంది. శ్రీరాముని అలంకరణలో హనుమంత సేవ నిర్వహిం చి 11గంటల కు గజవాహన సేవతో బాలాలయంలోకి పెళ్లి కుమారుడు, పెళ్లి కూతురును తీసుకుని వస్తారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారు. రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, కలెక్టర్ అనితా రామచంద్రన్ కల్యాణానికి హాజరుకానున్నారు. కల్యాణోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థాన ఈఓ గీతారెడ్డి తెలిపారు.
కనుల పండువగా ఎదుర్కోలు ఉత్సవం
శుక్రవారం రాత్రి ఎదుర్కోలు మహోత్సవం కనుల పండువగా సాగింది. స్వామి, అమ్మవార్లను పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడిగా అలంకారం చేసి వాద సంవాదాలను మనోహరంగా సాగించారు. ఉదయం స్వామి వారు జగన్మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమాల్లో దేవస్థానం చైర్మన్ నరసింహమూర్తి, ఈఓ గీతారెడ్డి, ఆలయ స్థానాచార్యులు రాఘవాచార్యులు, ప్రధానార్చకులు నల్లందీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment