పెళ్లి రద్దయిందని యువతి ఆత్మహత్య | young woman commit to sucide | Sakshi
Sakshi News home page

పెళ్లి రద్దయిందని యువతి ఆత్మహత్య

Published Tue, Mar 14 2017 2:35 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

పెళ్లి రద్దయిందని యువతి ఆత్మహత్య - Sakshi

పెళ్లి రద్దయిందని యువతి ఆత్మహత్య

ప్రేమిస్తున్నానని పెళ్లి చెడగొట్టిన సమీప బంధువు
భయంతో ఆ యువకుడూ ఆత్మహత్య


వైరా రూరల్‌: వివాహం రద్దయిందనే మనస్తాపంతో బీఈడీ విద్యార్థిని ఉషారాణి(24) బలవన్మరణానికి ఒడిగట్టింది. ప్రేమిస్తున్నానంటూ ఆమె సెల్‌కు మెసేజ్‌లు పంపిన ఓ యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా వైరా మం డలం సోమవరం గ్రామానికి చెందిన కంటేపూడి ఏసోబు–దేవరాణిల రెండో కుమార్తె ఉషారాణి తని కెళ్లలోని బ్రౌన్సు కళాశాలలో బీఈడీ చదువుతోంది. ఆమెకు గత నెల 5న సత్తుపల్లిలోని ద్వారకనగర్‌కు చెందిన ఓ యువకుడితో నిశ్చితార్థం జరిగింది. మే లో వివాహం జరగాల్సి ఉంది. అయితే, ఏపీలోని కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రా మానికి చెందిన ఉషారాణి సమీప బంధువు పోలగాని నరేంద్ర (26) ప్రేమిస్తున్నానంటూ ఉషారాణి సెల్‌కు తరచూ మెస్సేజ్‌లు పంపేవాడు.

విషయం తెలిసి కుటుంబ సభ్యులు ఉషారాణికి నిశ్చితార్థం చేశారు. ఈ క్రమంలోనే నరేంద్ర... ఉషారాణితో నిశ్చితార్థం చేసుకున్న యువకుడికి ఫోన్‌ చేసి ‘‘మేము ప్రేమిం చుకుంటున్నాం.. మా వివాహానికి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంటూ’’ చెప్పాడు. దీం తో వివాహం రద్దు అయ్యింది. మనస్తాపం చెందిన ఉషారాణి సోమవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాగా, ఉషారాణి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి.. కృష్ణా జిల్లాలో ఉన్న నరేంద్ర మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడాన్ని తట్టుకోలేకే నరేంద్ర చనిపోయినట్లు అతడి బంధువులు చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement