![పెళ్లాడాలంటూ.. ఓ యువతి పోరాటం - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/61435759199_625x300.jpg.webp?itok=1pDiQuxX)
పెళ్లాడాలంటూ.. ఓ యువతి పోరాటం
బెల్లంపల్లి (ఆదిలాబాద్): మేన బావ తనను పెళ్లి చేసుకోకుండా ముఖం చాటేస్తుండడంతో ఓ యువతి అతడి ఇంటి ముందు దీక్షకు దిగింది. ఈ ఘటన బుధవారం సాయంత్రం ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సుభాష్‌నగర్ బస్తీలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి సుభాష్ నగర్‌కు చెందిన దాసరి రమేష్, జైపూర్ మండలం రెడ్డిపల్లికి చెందిన గద్దల రాధ వరుసకుమేన బావ, మరదళ్లు. రాధకు గతంలో వేరొక వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. అయితే, తానే పెళ్లి చేసుకుంటానని రమేష్ దాన్ని చెడగొట్టాడు. ఆ తర్వాత మరదలిని పెళ్లి చేసుకోకుండా రమేష్ తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ రాధ తన తల్లి, సోదరుడితో కలసి రమేష్ ఇంటి ముందు బైఠాయించింది.