ప్రియురాలికి మరొకరితో పెళ్లయిందని... | Youngster commits suicide by worried about lover got married some one | Sakshi
Sakshi News home page

ప్రియురాలికి మరొకరితో పెళ్లయిందని...

Published Tue, Mar 10 2015 9:05 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

ప్రియురాలికి మరొకరితో పెళ్లయిందని... - Sakshi

ప్రియురాలికి మరొకరితో పెళ్లయిందని...

జడ్చర్ల(మహబూబ్‌నగర్): ప్రేమించిన యువతికి మరొకరితో వివాహం కావటంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరి వేసుకున్నాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో జరిగింది. సీఐ జంగయ్య కథనం...శ్రీశైలం ప్రాజెక్ట్ పరిధిలోని ఈగలపెంట గ్రామానికి చెందిన రవితేజ(20) గంగాపూర్ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే తాను ప్రేమించిన యువతికి ఇటీవల మరొకరితో పెళ్లి కావడంతో కొంతకాలంగా తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు.

దీంతో ఆదివారం ఇంటి నుంచి వెళ్లిన రవితేజ మంగళవారం జడ్చర్ల సమీపంలోని డీటీసీ ప్రాంగణంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. అతని దుస్తుల్లో ఉన్న పర్సును, ప్రేమ ఉత్తరాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం మత్తులో వెంట తెచ్చుకున్న తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement