మొమిన్‌పేట (రంగారెడ్డి) : ఆటోను దొంగిలించుకొని తీసుకువెళ్తున్న యువకుడు పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మొమిన్‌పేటలో సోమవారం జరిగింది. వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కేసారం గ్రామానికి చెందిన సురేష్(20) అనే యువకుడు మెదక్ జిల్లా నుంచి ఆటోను దొంగలించుకొని తీసుకువెళ్తుండగా.. తనిఖీలు నిర్వహిస్తున్న మొమిన్‌పేట పోలీసులకు పట్టుబడ్డాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.