అభిమాన స్వాగతం
జాతీయ రహదారి సోమవారం జనంతో ఉరకలెత్తింది. జననేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా వెళ్తూ మహబూబ్‌నగర్ జిల్లాలోని తిమ్మాపూర్, జడ్చర్ల,పెబ్బేరు, అలంపూర్ తదితర ప్రాంతాల మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు ఆయా ప్రాంతాల నేతలు, ఎమ్మెల్యే అభ్యర్థులు, కార్యకర్తలు, మహిళలు ఘనంగా స్వాగతించారు.
ఎక్కడికక్కడ ఆపి పుష్ప గుచ్ఛాలు అందించి ఆయన కరచాలనం కోసం పోటీ పడ్డారు. జగన్ వారికి అభివాదం చేసి పలుచోట్ల కిందకు దిగి స్థానికులను ఆప్యాయంగా పలుకరించారు. అనంతరం ఆయన కర్నూలు జిల్లాలో జరగనున్న ఎన్నికల సభల్లో పాల్గొనేందుకు వెళ్లారు.
జడ్చర్ల/అలంపూర్/పెబ్బేరు/కొత్తూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పాలమూరు ప్రజలు, అభిమానులు ఘనమైన ఆత్మీ య స్వాగతం పలికారు. సోమవారం ఆయన జిల్లా మీదుగా కర్నూలులో జరి గిన ప్రచార సభలకు వెళ్లారు. జగనన్న వస్తున్న విషయాన్ని తెలుసుకుని జాతీ య రహదారి వెంట ఉన్న కొత్తూరు, జడ్చర్ల, పెబ్బేరు, అలంపూర్ పట్టణాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వేలాది మంది అభిమానులు ఆయనను కలుసుకునేందుకు తరలివచ్చారు.
జిల్లా ముఖ ద్వారం తిమ్మాపూర్ వద్ద షాద్‌నగర్ నియోజవర్గ నేతలు బొబ్బిలి సుధాకర్‌రెడ్డి, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు కోన దేవయ్యలు స్వాగతం పలికారు. జడ్చర్ల ప్రభుత్వ అతిథి గృహం సమీపంలో మహబూబ్‌నగర్ ఎంపీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రహమాన్, ఎమ్మెల్యే అభ్యర్థులు బెక్కరి శ్రీనివాస్‌రెడ్డి, పాండునాయక్‌లు తమ అధినేతకు పూలమాలలు వేసి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా జగన్‌ను చేసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు అభిమానులు పోటీపడ్డారు. ఆయన వాహ నంపైకి అభివాదం చేస్తూ చిరునవ్వుతో అభిమానులను పలకరించారు. వనపర్తి నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి రవిప్రకాష్ ఆధ్వర్యంలో మహిళలు, కార్యకర్తలు పెబ్బేరులోని రంగాపూర్ బైపాస్‌వద్ద తమ అధినేతను కలుసుకున్నారు.
తరలి వచ్చిన కర్నూలు నేతలు
అలంపూర్ టోల్‌ప్లాజా జగన్ నినాదం తో మర్మోగింది.జాతీయ రహదారిఅలంపూర్ అభ్యర్థి బంగి లక్ష్మన్న ఆధ్వర్యం లో కార్యకర్తలు, మద్దతు దారులు భారీ గా వచ్చారు. అలాగే సరిహద్దు కావడం తో తమ అధినేతకు స్వాగతం పలికేందుకు కర్నూలుకు చెం దిన పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌ రు వెంకట్‌రెడ్డి, ఎంపీ ఎస్‌పీ వై రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గౌరు చరిత, కొత్తకోట ప్రకాష్‌రెడ్డి తదితరులు తమ అనుచరులతో పుల్లూరు టోల్‌ప్లాజా వద్దకు చేరుకున్నారు. ప్రజలు భారీగా తరలి రావడంతో టోల్‌ప్లాజా ప్రాంగణం జనసంద్రంలో నిండిపోయింది. తమ అభిమాన నేత రాగానే కార్యకర్తలు ఆయన కాన్వాయిని చుట్టుముట్టారు. ఆ ప్రాంతమంతా జై జగన్...జై వైఎస్సార్..అంటూ మార్మోగింది.