హుజూర్‌నగర్ : తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చే సేందుకు ప్రతికార్యకర్త కృషిచేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం హుజూర్‌నగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 8న హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో గల క్రిస్టల్ గార్డెన్స్‌లో ఉదయం 9 గంటలకు పార్టీ రాష్ట్రస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతున్న ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించి వాటి పరిష్కారానికి రానున్న కాలంలో పార్టీ తరఫున ప్రజల పక్షాన పోరాటాలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఆశయసాధన కోసం స్థాపించిన వైఎస్సార్ సీపీ బడుగు, బలహీనవర్గాలకు అండగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలో వైఎస్సార్ సీపీ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారితో పాటు జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సింగిల్‌విండో చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులంతా ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు అయిల వెంకన్నగౌడ్, వేముల శేఖర్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పోతుల జ్ఞానయ్య,కోడి మల్లయ్య, నాయకులు గుర్రంవెంకటరెడ్డి, జడ రామకృ ష్ణ, పులిచింతల వెంకటరెడ్డి, కస్తాల ముత్తయ్య, మందా వెంకటేశ్వర్లు, పిల్లి మరియదాసు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కృషి
Published Tue, Oct 7 2014 12:58 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement
Advertisement