పారిశుధ్య కార్మికులకు వైఎస్‌ఆర్ సీపీ మద్దతు
వినాయక్‌నగర్ : వేతనాలు పెంచాలని, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పారిశుధ్య కార్మికులు సాగిస్తున్న సమ్మెకు వైఎస్‌ఆర్ సీపీ సంపూర్ణ మద్దతునిస్తున్నదని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గైనికాడి విజయలక్ష్మి చెప్పారు. సమ్మెకు మద్దతుగా వామపక్షాలు శుక్రవారం ఇచ్చిన బంద్ పిలుపునకు ఆమె సంఘీభావం తెలిపారు. మున్సిపల్ కార్యలయం వద్ద ధర్నా చేస్తున్న కార్మికుల వద్దకు వైఎస్‌ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె ర్యాలీగా వెళ్లి మద్దతు తెలిపారు. ధర్నానుద్దేశించి ఆమె మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దే కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో సీఎం విఫలమయ్యారని విమర్శించారు.
కార్మికుల డిమాండ్లను నెరవేర్చడం ద్వారా సమ్మెను విరమించేందుకు ప్రయత్నించకుండా వారితోపాటు వారి నాయకుల అరెస్టును తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కాదేశి నవీన్, సేవాదళ్ విభాగం జిల్లా అధ్యక్షుడు నాగుల ప్రమోద్, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు రాచమల్లు మల్లేష్, ఉపాధ్యాయ విభాగం జిల్లా అధ్యక్షుడు డిఎల్‌ఎన్.చారి, నగర అధ్యక్షుడు మొపాల్ జితేందర్‌రెడ్డి, నాయకులు రాజు, శ్రీధర్, గిరిబాబు, రా జేందర్, లక్ష్మి, సోని, రాధిక, యమున, గం గ, సరస్వతి, యమున, మున్నీ పాల్గొన్నారు.