
నేడు వైఎస్సార్ వర్ధంతి
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతిని మంగళవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముత్తినేని సోమేశ్వర్‌రావు సోమవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
వరంగల్ : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతిని మంగళవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముత్తినేని సోమేశ్వర్‌రావు సోమవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. వైఎస్ వర్ధంతిని పురస్కరించుకుని గ్రామాలు, మండల, డివిజన్ కేంద్రాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. వరంగల్ హంటర్ రోడ్డులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఉదయం 11 గంటలకు వైఎస్సార్ వర్ధంతిని నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావాలని సోమేశ్వర్‌రావు కోరారు.