రాజన్నకు జోహార్
వాడవాడలా వైఎస్ వర్ధంతి
పాలాభిషేకాలు, అన్నదానాలు, రక్తదాన శిబిరాలు
రోగులకు పాలు, రొట్టెల పంపిణీ కార్యక్రమాలు
డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ఆరో వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం జిల్ల్యావాప్తంగా పలువురు ఆయనకు ఘన నివాళి అర్పించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గా ల్లోనూ వైఎస్ విగ్రహాలకు, చిత్రపటా లకు నేతలు, కార్యకర్తలు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. వైఎస్సార్ అమర్ రహే... జోహార వైఎస్సార్ అంటూ భారీ ర్యాలీలు చేపట్టారు. తిరుపతి, చిత్తూరు నగరాలతో పాటు మండల కేంద్రాల్లో యువత స్వచ్ఛందంగా రక్తదానశిబిరాల్లో పాల్గొంది. ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు పండ్లు, రొట్టెలు, పాలు పంచిపెట్టారు.
తిరుపతి అర్బన్ : తిరుపతి తుడా సర్కిల్ వద్దనున్న వైఎస్.రాజశేఖరరెడ్డి నిలువెత్తు విగ్రహానికి వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ప్ల కార్డు లు చేతబట్టి జోహార్ వైఎస్సార్ అంటూ కార్యకర్తలు, అభిమానులు నినాదాలతో ప్రదర్శన చేశారు. 5వేల మందికి పైగా పేదలకు అన్నదానం చేశారు. నగరంలోని వివిధ వార్డుల్లోనూ అన్నదానం చేశారు. తుడా సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గం లోని అన్ని మండల కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుల ఆధ్వర్యంలో వైఎస్ వర్ధంతి నిర్వహించారు. పెనుమూరు మండలం సాతంబాకంలో వైఎస్సార్ సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి నరసింహారెడ్డి ఆధ ్వర్యంలో 500 మందికి అన్నదానం చేశారు. శ్రీరంగరాజుపురం మండలంలోని కొత్తపల్లిమిట్టలో, పెనుమూరు మండలంలోని గొడుగుమానుపల్లిలో వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు.
నగరి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ మండలాధ్యక్షులు, పుత్తూరులో బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏళుమలై(అములు), డీసీసీబీ డెరైక్టర్ దిలీప్‌రెడ్డి, నిండ్రలో రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్థంతి కార్యక్రమాలు చేపట్టారు.
మదనపల్లె నియోజకవర్గంలోని మదనపల్లె మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షమీమ్ అస్లాం, ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే సోదరుడు జయదేవరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్థంతి నిర్వహించారు.పలమనేరులో పార్టీ పట్టణ కన్వీనర్ హేమంత్‌కుమార్‌రెడ్డి, సీవీ కుమార్ ఆధ్వర్యంలో, గంగవరం, బెరైడ్డిపల్లిలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వర్థంతి కార్యక్రమాలు చేపట్టారు.
చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుపతి రూరల్ మండల పరిధిలో గల పెరుమాళ్లపల్లి, సి.మల్లవరంలలో అన్నదానం చేశారు. వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు ఆధ్వర్యంలో ‘పాస్’ మనోవికాస కేంద్రంలో పండ్లు పంచి, అన్నదానం చేశారు. అన్ని మండలాల్లో వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేశారు.
సత్యవేడు నియోజకవర్గంలో సమన్వయకర్త ఆదిమూలం ఆధ్వర్యంలో, ఆయా మండలాల్లో పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో వర్థంతి కార్యక్రమాలు చేపట్టారు. అన్నదానం చేశారు.పూతలపట్టు నియోజకవర్గంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తలపులపల్లి బాబురెడ్డి, జిల్లా కార్యదర్శి రాజరత్నం రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్థంతి జరిగింది. పీ.కొత్తకోటలోని వైఎస్సార్ విగ్రహానికి నాయకులు పాలాభిషేకం చేశారు. పేదలకు అన్నదానం చేశారు. పీహెచ్‌సీలో రోగులకు పండ్లు, రొట్టెలు పంచారు.
చిత్తూరు నగరంలో పార్టీ జిల్లా నేతలు జంగాలపల్లి శ్రీనివాసులు, గాయత్రీదేవి, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఆధ్వర్యంలో వైఎస్ వర్థంతి వేడుకలు నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు అన్నదానం చేశారు. రెడ్‌క్రాస్ సంస్థలో రక్తదానం చేశారు.శ్రీకాళహస్తిలోని ఎంపేడులో నిర్వహించిన వైఎస్ వర్థంతి కార్యక్రమాల్లో తిరుపతి ఎంపీ వరప్రసాద్, నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పిల్లలకు పలకలు, పుస్తకాలు పంపిణీ చేశారు.
పీలేరులో పార్టీ మండల నాయకుడు నారె వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. రోగులకు పండ్లు, రొట్టెలు పంచిపెట్టారు.కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త చంద్రమౌళి, జెడ్పీ మాజీ చైర్మన్ సుబ్రమణ్యంరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ వర్థంతి నిర్వహించారు. వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.తంబళ్లపల్లి నియోజకవర్గంలోని శంకరాపురం, గట్టు గ్రామాల్లో నాయకులు పేదలకు అన్నదానం చేశారు.
పుంగనూరు నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ ద్వారకనాథరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టారు. పాతబస్టాండులోని రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి, పూజలు చేసి అంజలి ఘటించారు. పార్టీ రాష్ట్ర కార్యద ర్శి ఎన్.రెడ్డెప్ప, కొండవీటి నాగభూషణం పాల్గొన్నారు.