నల్లగొండ టుటౌన్ వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ జిల్లా నూతన కమిటీని ప్రకటించింది. ఇటీవల జిల్లా కొత్త అధ్యక్షుడిని నియమించిన పార్టీ అధినాయకత్వం శనివారం పార్టీ కార్యవర్గానికి కూడా ఆమోదం తెలిపింది. మొత్తం 39 మందితో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఐల వెంకన్నగౌడ్ పార్టీ కేంద్ర నాయకత్వానికి పంపించిన జిల్లా కార్యవర్గం పేర్లను పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆమోదించారు. దీంతో నూతన కమిటీని ప్రకటించారు.
జిల్లా నూతన కార్యవర్గం ఇదే...
జిల్లా కార్యదర్శులు
ఇనుపాల పిచ్చిరెడ్డి, చిత్తలూరి సొమయ్యగౌడ్, కొడి మల్లయ్య యాదవ్, కర్నె వెంకటేశ్వర్లు (హుజూర్‌నగర్), మర్రెడ్డి జానకిరాంరెడ్డి (నకిరేకల్), నలవెల్లి దామోదర్‌రెడ్డి, వంగాల వెంకట్‌రెడ్డి (దేవరకొండ), దండ శ్రీనివాస్‌రెడ్డి (సూర్యాపేట), జి.వెంకటనారాయణరెడ్డి, కొత్త బయ్యన్న (భువనగిరి), మెడిశెట్టి యాదయ్య, కట్టెబోయిన నాగరాజు (నల్లగొండ), తండు ఆంజనేయులు (ఆలేరు), దేవిరెడ్డి లింగారెడ్డి (కోదాడ), వెల్ల శ్రీనివాస్‌రెడ్డి, కొంపల్లి శ్రీనివాస్, బొడ యాకూబ్ (తుంగతుర్తి), దైద ప్రేమ్‌కుమార్ (మిర్యాలగూడ) నియమితులయ్యారు.
జిల్లా సహాయ కార్యదర్శులు
కొల్లు శ్రీధర్‌రెడ్డి, పిరన్ జానయ్య (సూర్యాపేట), గుండా సత్యనారాయణ, సుక్రి నర్సా (భువనగిరి), చిలకల యాదగిరి (ఆలేరు), నూనె నర్సింహగౌడ్, కల్మెకోను జగన్‌మోహన్‌రెడ్డి (నకిరేకల్), పి.పాండు (దేవరకొండ), యర్రంశెట్టి విష్ణు, ధారావత్ లచ్చిరాం నాయక్ (కోదాడ), రవినాయక్(మిర్యాలగూడ), ఇస్లావత్ అశోక్ నాయక్, అంకిరెడ్డి సుదర్శన్ (తుంగతుర్తి) నియమితులయ్యారు.
జిల్లా కోశాధికారి: పిల్లి మరియదాస్(హుజూర్‌నగర్)
జిల్లా కార్యవర్గ సభ్యులు: లోడంగి గంగాధర్, దేశగోని జ్ఞానయ్య (సూర్యాపేట), చెన్నగోని యాదగిరిగౌడ్ (నకిరేకల్), బొగల వెంకట్‌రెడ్డి (హుజూర్‌నగర్), పసుపులేటి సోమయ్య, నర్సింగోజు సైదాచారి, ఉబ్బని రవి (మిర్యాలగూడ) నియమితులయ్యారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యవర్గం ఎన్నిక
Published Sun, May 24 2015 12:14 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement