District Selection Committee
-
జనవరిలో డీఎస్సీ!
-
జనవరిలో డీఎస్సీ!
♦ ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సర్కారు నిర్ణయం ♦ 10 వేల వరకు పోస్టులు ఉండే అవకాశం! ♦ వచ్చే విద్యా సంవత్సరంలో కొత్త టీచర్లు ♦ అప్పటివరకు విద్యా వలంటీర్లతో బోధన ♦ వచ్చేనెల 10 నాటికి 7,983 మంది వీవీల నియామకం ♦ రూ. 8 వేల వేతనంతో మండలం యూనిట్‌గా భర్తీ ♦ రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ప్రక్రియను పూర్తిచేసి పాఠశాలల్లో కొత్త టీచర్లను నియమించనుంది. దాదాపు 10 వేల ఉపాధ్యాయ పోస్టులు ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా. అయితే ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ జారీ చేసినా.. ప్రక్రియ పూర్తయ్యేందుకు ఐదారు నెలల సమయం పడుతుంది. అంటే ప్రస్తుత విద్యా సంవత్సరం దాదాపు పూర్తయి, వేసవి సెలవుల సమయం వస్తుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెలాఖరు లేదా జనవరిలో నోటిఫికేషన్ జారీచేస్తే మే నెలాఖరుకల్లా నియామకాల ప్రక్రియను పూర్తి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా వచ్చే ఏడాది జూన్ 12న స్కూళ్లు ప్రారంభించే నాటికి కొత్త టీచర్లను పాఠశాలలకు పంపించాలన్న యోచనలో ఉంది. వారంలో విద్యా వలంటీర్లు.. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సమయం పట్టే అవకాశం ఉన్నందున టీచర్లు లేని స్కూళ్లలో వెంటనే విద్యా వలంటీర్లను నియమించనున్నారు. ప్రస్తుతమున్న 7,983 ఖాళీల్లో సెప్టెంబర్ 10వ తేదీ నాటికి ఈ నియామకాలను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విద్యా వలంటీర్లకు నెలకు రూ.8 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించే అవకాశముంది. ఎస్జీటీ ఖాళీల్లో నియమించే వారికి ఇంటర్‌తోపాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) విద్యార్హత ఉండాలి. స్కూల్ అసిస్టెంట్ స్థానంలో నియమితులయ్యే వారికి డిగ్రీతోపాటు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) అర్హత ఉండాలి. మండలం యూనిట్‌గా జిల్లా యంత్రాంగం నేతృత్వంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ఈ నియామకాలను చేపడతాయి. ఆ మండలానికి చెందిన వారినే విద్యా వలంటీర్లుగా నియమిస్తారు. వయోపరిమితి తదితర వివరాలు మార్గదర్శకాల్లో ఉంటాయి. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. టెన్త్, ఇంటర్, డీఎడ్/బీఎడ్‌లో అభ్యర్థులు సాధించిన మార్కులకు వెయిటేజీ ఇచ్చి మెరిట్‌ను రూపొందించి నియామకాలు చేపడతారు. దీంతోపాటు రోస్టర్, రిజర్వేషన్లను పాటిస్తారు. ఈ మేరకు మార్గదర్శకాలు రెండు మూడు రోజుల్లో జారీ కానున్నాయని పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు వెల్లడించారు. ఖాళీలపై స్పష్టత వచ్చినందునే.. ‘‘ఉపాధ్యాయ ఖాళీలపై ప్రస్తుతం స్పష్టత వచ్చింది. గతంలో ఆ స్పష్టత లేనందునే కొత్త నోటిఫికేషన్‌పై దృష్టి పెట్టలేదు. ఇప్పుడు కూడా వెంటనే నియామకాలు చేపట్టడం సాధ్యం కాదు. నోటిఫికేషన్ ఇచ్చినా ఐదారు నెలల సమయం పడుతుంది. మొత్తానికి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త టీచర్లను నియమిస్తాం. డీఎస్సీ నోటిఫికేషన్ జారీ ఎప్పుడన్నది త్వరలో నిర్ణయిస్తాం..’’ - డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. జిల్లాల వారీగా నియామకం కానున్న విద్యా వలంటీర్లు - మహబూబ్‌నగర్ 1,646 - రంగారెడ్డి 1,408 - ఆదిలాబాద్ 1,244 - మెదక్ 1,104 - ఖమ్మం 674 - నిజమాబాద్ 480 - హైదరాబాద్ 414 - నల్లగొండ 362 - కరీంనగర్ 337 - వరంగల్ 314. -
వైఎస్సార్సీపీ జిల్లా కార్యవర్గం ఎన్నిక
నల్లగొండ టుటౌన్ వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ జిల్లా నూతన కమిటీని ప్రకటించింది. ఇటీవల జిల్లా కొత్త అధ్యక్షుడిని నియమించిన పార్టీ అధినాయకత్వం శనివారం పార్టీ కార్యవర్గానికి కూడా ఆమోదం తెలిపింది. మొత్తం 39 మందితో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఐల వెంకన్నగౌడ్ పార్టీ కేంద్ర నాయకత్వానికి పంపించిన జిల్లా కార్యవర్గం పేర్లను పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆమోదించారు. దీంతో నూతన కమిటీని ప్రకటించారు. జిల్లా నూతన కార్యవర్గం ఇదే... జిల్లా కార్యదర్శులు ఇనుపాల పిచ్చిరెడ్డి, చిత్తలూరి సొమయ్యగౌడ్, కొడి మల్లయ్య యాదవ్, కర్నె వెంకటేశ్వర్లు (హుజూర్నగర్), మర్రెడ్డి జానకిరాంరెడ్డి (నకిరేకల్), నలవెల్లి దామోదర్‌రెడ్డి, వంగాల వెంకట్‌రెడ్డి (దేవరకొండ), దండ శ్రీనివాస్‌రెడ్డి (సూర్యాపేట), జి.వెంకటనారాయణరెడ్డి, కొత్త బయ్యన్న (భువనగిరి), మెడిశెట్టి యాదయ్య, కట్టెబోయిన నాగరాజు (నల్లగొండ), తండు ఆంజనేయులు (ఆలేరు), దేవిరెడ్డి లింగారెడ్డి (కోదాడ), వెల్ల శ్రీనివాస్‌రెడ్డి, కొంపల్లి శ్రీనివాస్, బొడ యాకూబ్ (తుంగతుర్తి), దైద ప్రేమ్‌కుమార్ (మిర్యాలగూడ) నియమితులయ్యారు. జిల్లా సహాయ కార్యదర్శులు కొల్లు శ్రీధర్‌రెడ్డి, పిరన్ జానయ్య (సూర్యాపేట), గుండా సత్యనారాయణ, సుక్రి నర్సా (భువనగిరి), చిలకల యాదగిరి (ఆలేరు), నూనె నర్సింహగౌడ్, కల్మెకోను జగన్మోహన్రెడ్డి (నకిరేకల్), పి.పాండు (దేవరకొండ), యర్రంశెట్టి విష్ణు, ధారావత్ లచ్చిరాం నాయక్ (కోదాడ), రవినాయక్(మిర్యాలగూడ), ఇస్లావత్ అశోక్ నాయక్, అంకిరెడ్డి సుదర్శన్ (తుంగతుర్తి) నియమితులయ్యారు. జిల్లా కోశాధికారి: పిల్లి మరియదాస్(హుజూర్నగర్) జిల్లా కార్యవర్గ సభ్యులు: లోడంగి గంగాధర్, దేశగోని జ్ఞానయ్య (సూర్యాపేట), చెన్నగోని యాదగిరిగౌడ్ (నకిరేకల్), బొగల వెంకట్‌రెడ్డి (హుజూర్నగర్), పసుపులేటి సోమయ్య, నర్సింగోజు సైదాచారి, ఉబ్బని రవి (మిర్యాలగూడ) నియమితులయ్యారు. -
సార్ల దయ ఉంటేనే ‘యంత్రలక్ష్మి’
- లబ్ధిదారుల ఎంపికలో లోపించిన పారదర్శకత - ఫోర్‌వీల్ డ్రైవ్ ట్రాక్టర్ కేటాయింపులో పైరవీలు - నామమాత్రంగా వ్యవహరించిన జిల్లా సెలక్షన్ కమిటీ - అసంతృప్తి వ్యక్తం చేస్తున్న అన్నదాతలు నిజామాబాద్‌అర్బన్/మోర్తాడ్: ‘యంత్రలక్ష్మి’ పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేయడంలో పారదర్శకత లోపించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు సూచించిన వారికే వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ట్రాక్టర్ యూనిట్లను కేటాయించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేజ్‌వీల్స్ అవసరం లేకుండా పంట పొలాలను దున్నడానికి ఫోర్‌వీల్ ట్రాక్టర్లను ఆయా కంపెనీలు తయారు చేశాయి. వీటితో రహదారులు దెబ్బతినే అవకాశం ఉండదు. అందుకే వీటిని రైతుల కు ‘యంత్రలక్ష్మి’ పథకం కింద 50 శాతం సబ్సిడీతో అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని రైతాంగానికి 179 ఫో ర్వీల్ ట్రాక్టర్ యూనిట్లను కేటాయించారు. వీటి ధర రూ. ఎనిమిది లక్షల నుంచి రూ. తొమ్మిది లక్షల వరకు ఉంది. ట్రాక్టర్ ధరలో రైతు సగం చెల్లిస్తే మిగిలిన మొత్తం ప్రభుత్వం సబ్సిడీ రూ పంలో అందిస్తుంది. ‘అధికార’ అండదండలున్నవారికే ఫోర్‌వీల్ ట్రాక్టర్ యూనిట్లను పొందడానికి దాదాపు 670 మం ది రైతులు మండల వ్యవసాయూధికారి కార్యాలయూలలో దరఖాస్తు చేసుకున్నారు. 18 మందికి ప్రోసీడింగులు అందించారు. ఇందులో అనర్హులు ఉండడం గమనార్హం. రైతులు ఇచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి జేడీఏ కార్యాలయానికి పం పించారు. వాటిని జిల్లా సెలక్షన్ కమిటీ పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు సూచించినవారిని సెలక్ష న్ కమిటీ ఎంపిక చేసిందని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ఫోర్‌వీల్ ట్రాక్టర్ యూనిట్ల కేటాయింపు పారదర్శకంగా జరుగలేదని అధికార పార్టీ అండదండలు ఉన్న వారికే యూనిట్లను కేటాయించారని చెబుతున్నారు. పారదర్శకంగా ఎంపిక జరిగి ఉంటే అర్హులకు ట్రాక్టర్ యూనిట్లు దక్కేవని అభిప్రాయం వ్య క్తం చేస్తున్నారు. ఫోర్ వీల్ ట్రాక్టర్ల యూనిట్ల కేటాయింపు విషయూన్ని ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ స ర్వసభ్య సమావేశంలో ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు ప్రశ్నించారు. అధికార పార్టీకి సంబంధించినవారికే ట్రాక్టర్ యూనిట్లను కేటాయించారని వివరించారు. అపుడు వ్యవసాయశాఖ మంతి పోచారం శ్రీనివాస్‌రె డ్డి స్పందించి భవిష్యత్తులో అర్హులైన అందరికి ట్రాక్టర్ యూనిట్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అనర్హులే లబ్ధిదారులు ప్రజాప్రతినిధులు సైతం తాము చెప్పిందే వేదంగా సాగాలంటున్నారు. ఆయా నియోజకవర్గాలలో సబ్సిడీ యంత్రాలకు అర్హుల ఎంపికలో తాము సిఫార్సు చేసిన వారినే అర్హులుగా గుర్తించాలని అధికారులకు ఆదేశిస్తున్నారు. దీంతో ‘యంత్రలక్ష్మి’ అర్హుల జాబితా సిఫార్సు జాబితాగా మారింది. సరైన రైతులకు ట్రాక్టర్లు అందక ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. మొదటి దశలో 150 ట్రాక్టర్లను అందించాల్సి ఉంది. రెంజల్ మండలంలో ఓ వైద్యుడు యంత్రలక్ష్మిలో భాగంగా ట్రాక్టర్‌ను పొందాడు. స్వయంగా జిల్లా పరిషత్ సమావేశంలో సంబంధిత ఎంపీపీ కూడా ఈ విషయంలో వెలుగులోకి తీసుకవచ్చారు. రాజకీయ పార్టీ నాయకు లు, ప్రజాప్రతినిధులు ,వైద్యులు, వ్యాపారస్తులు ఇతరుల పం టలను, తప్పుడు పత్రాలు చూపించి 50 శాతం సబ్సిడీపైన ట్రాక్టర్లను పొందారు. మోర్తాడ్ మండలంలో యంత్రలక్ష్మిలో భాగంగా ట్రా క్టర్ల కోసం 26 దరఖాస్తులు వచ్చాయి. కానీ, జేడీఏ కార్యాలయానికి జాబితా రాగానే కేవలం ఏడుగురు మా త్రమే ఉన్నారు. మిగితవారిని మండల కేంద్రంలోనే తొలగిం చారు. ఇందులో ఉన్నవారు సైతం ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసిన వారేనని తెలిసింది. మోర్తాడ్ ఎంపీపీ దరఖాస్తు చేయించిన పేర్లు సైతం మాయమయ్యాయి. విచారణ జరపాలి ధర్పల్లి మండలంలో ఇద్దరు వ్యాపారస్తులు ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. వీరు ఇతర రైతులకు వాటిని అద్దెకు ఇవ్వడం గమనార్హం. నిజామాబాద్ మండల కేంద్రం లో యంత్రలక్ష్మికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఓ ప్రజాప్రతినిధి వద్దే కొనసాగింది. స్వయంగా ఆయనే పరిశీలించి ఇచ్చిన దరఖాస్తులను ఎంపిక చేశారు. నిజాం సాగర్ మండలంలో అసలు వ్యవసాయభూమి లేని వారు ట్రాక్టర్లను పొందారు. మండల స్థాయిలో ట్రాక్టర్లు పొందినవారిలో స్థానిక నేతలూ ఉన్నారు. అధికారులు చె ప్పిన దానిని ఏమాత్రం పట్టించుకోకుండా, తాము చెప్పిన వారికే ఇవ్వాలంటూ ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెచ్చారని సమాచారం. ఉన్నతాధికారులు విచారణ చేపడితే అర్హులకు న్యాయం జరిగే అవకాశం ఉంది. -
టీచర్ పోస్టుల భర్తీకి పచ్చజెండా
* మే 9, 10, 11 తేదీల్లో ఉపాధ్యాయ పరీక్షలు * 9,061 పోస్టుల భర్తీకి ‘టెట్ కమ్ టీఆర్టీ’ * షెడ్యూల్ విడుదల చేసిన ఏపీ మంత్రి గంటా * డిసెంబర్ 3 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ * టెట్‌లో అర్హత సాధించినా పరీక్ష రాయాల్సిందే * నేడు నోటిఫికేషన్ జారీ * వెబ్సైట్లో జిల్లాలవారీగా ఖాళీలు, సిలబస్ వివరాలు వెల్లడించనున్న విద్యాశాఖ * ఐటీడీఏ, గురుకుల స్కూళ్లకు ప్రత్యేకంగా నోటిఫికేషన్ * ఎస్జీటీ పోస్టులపై బీఈడీలకు నిరాశ సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో 9,061 టీచ ర్ పోస్టుల భర్తీకి 2015 మే 9, 10, 11వ తేదీల్లో రాతపరీక్ష నిర్వహించనున్నట్లు మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం ప్రకటించారు. గతంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్), ఉపాధ్యాయ నియామక పరీక్ష(డీఎస్సీ)లను విడివిడిగా నిర్వహించగా ఈసారి రెండింటినీ కలిపి ‘టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ కమ్ టీచర్ రిక్రూట్మెంటు టెస్ట్’(టెట్ కమ్ టీఆర్టీ) పేరుతో ఒకే పరీక్షగా నిర్వహించనున్నట్లు వివరించారు. 1,849 స్కూల్ అసిస్టెంటు పోస్టులు, 812 భాషా పండితుల పోస్టులు, 156 పీఈటీ పోస్టులు, 6,244 ఎస్జీటీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ స్కూళ్లలోని పోస్టులకు మాత్రమే ఈ షెడ్యూల్ వర్తిస్తుంది. ఐటీడీఏ, గురుకులాలు తదితర స్కూళ్లలోని పోస్టుల భర్తీకి ఆయా విభాగాలు ప్రత్యేక నోటిఫికేషన్లు జారీ చేస్తాయన్నారు. టీచర్ పోస్టు ల భర్తీకి పాఠశాల విద్యాశాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. పరీక్ష ఫీజు, విధివిధానాలను అందులో పొందుపరుస్తామని మంత్రి చెప్పారు. ఆన్లైన్లోనే దరఖాస్తులు సమర్పించాలి. దరఖాస్తు ప్రొఫార్మాను ఠీఠీఠీ.ఛీట్ఛ్చఞ.జౌఠి.జీ వెబ్సైట్లో పొందవచ్చు. షెడ్యూల్‌తో పాటు సి లబస్, నిబంధనలు, మార్గదర్శకాలు, జిల్లాల వారీగా ఖాళీల వివరాలు వెబ్సైట్లో ఉంటాయి. కేటగిరీల ప్రకారం అర్హత మార్కులు టెట్ కమ్ టీఆర్టీ పరీక్షలో ఓసీలు 60 శాతానికి పైగా, బీసీలు 50 శాతానికి పైగా, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు 40 శాతానికి పైగా మార్కులు సాధిస్తేనే టీచర్ పోస్టులకు అర్హత లభిస్తుంది. ఈ ఏడాది జూలై 1వ తేదీ నాటికి 18 నుంచి 40 ఏళ్ల లోపు వయసు ఉన్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 2012 తరువాత టీచర్ పోస్టుల భర్తీ జరగనందున వయోపరిమితి పెంచినట్లు మంత్రి వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనంగా మరో ఐదేళ్లు సడలింపు ఉంటుందని, వికలాంగులకు 50 ఏళ్లుగా నిర్ధారించామన్నారు.గతంలో టెట్ రాసి అర్హత సాధించిన వారు సైతం ఈ పరీక్షలు రాస్తేనే టీచర్ పోస్టులకు ఎంపికయ్యే అవకాశం లభిస్తుందన్నారు.ఆదర్శ పాఠశాలల్లో 491 పీజీటీ నియామకాలు పూర్తి చేశామన్నారు. 498 టీజీటీ పోస్టులకు సంబంధించి కోర్టు కేసులున్నందున భర్తీ చేయలేకపోయామని మంత్రి వివరించారు. విద్యాశాఖ కార్యదర్శి అధర్‌సిన్హా, పాఠశాల విద్యాశాఖ ఇన్చార్జి కమిషనర్, ఇంటర్ బోర్డు కార్యదర్శి రాంశంకర్ నాయక్ పాల్గొన్నారు. బీఈడీలకు మొండిచేయి ఎస్జీటీ పోస్టుల్లో బీఈడీలకు అవకాశం కల్పిస్తామని ఎన్నికల ముందునుంచి చెబుతూ వచ్చిన టీడీపీ సర్కారు ఆపేరిట టీచర్ పోస్టుల భర్తీని వాయిదా వేస్తూ వచ్చింది. తమకు అవకాశం దక్కుతుందని ఆశపడ్డ బీఈడీ అభ్యర్ధుల ఆశలపై నీళ్లు కుమ్మరించింది. కేంద్రం అనుమతి ఇవ్వనందున బీఈడీలకు ఎస్జీటీల్లో అవకాశం కల్పించలేకపోతున్నామని,అవి డీఈడీ అభ్యర్థులకేనని మంత్రి తేల్చి చెప్పారు. ఇకనుంచి ఏటా భర్తీ చేపడతామన్నారు. వచ్చే ఏడాది బీఈడీలకు ఎస్జీటీల్లో అవకాశం కల్పిస్తామని చెప్పారు. టెట్, టీఆర్టీ కింద ఒక్కటే పరీక్ష పత్రం రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రత్యేకంగా ఉండదని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. టెట్, ఉపాధ్యాయ ఎంపిక పరీక్ష (టీఆర్టీ) కలిపి ఒకటే పరీక్ష, ఒకే ప్రశ్నపత్రం ఉంటుందని వివరించింది. టెట్, టీఆర్టీకి సంబంధించిన ప్రశ్నలు ఒక్క పరీక్షలోనే ఉంటాయంది. పరీక్ష పేపర్లో టెట్, టీ ఆర్టీలకు వేర్వేరుగా ప్రశ్నపత్రాలుంటాయా అన్న దానిపై స్పష్టత లేకపోవడంతో పాఠశాల విద్యాశాఖ గురువారం సాయంత్రం మరో ప్రకటన జారీచేసింది. ‘గతంలో టెట్ పరీక్షలో అర్హత సాధి ంచిన అభ్యర్ధులు కూడా తప్పనిసరిగా టెట్ కమ్ టీఆర్టీ పరీక్షకు హాజరుకావాలి. టెట్‌లో అర్హత పొందిన వారికి 20 శాతం ప్రాధాన్యమిస్తారు. టెట్‌కమ్ టీఆర్టీలో వచ్చిన మార్కులతో పోల్చి ఏవి ఎక్కువైతే వాటినే పరిగణనలోకి తీసుకుంటారు’ అని వివరించింది. డీఎస్సీలో మునిసిపల్, ఐటీడీఏ ఖాళీలు ఏవి?: యూటీఎఫ్ తాజాగా ప్రకటించిన డీఎస్సీ-2014లో మునిసిపల్ పాఠశాలలకు చెందిన 1,252, ఐటీడీఏలోని 314 ఖాళీలు ప్రకటించకపోవడం అన్యాయమని యూటీఎఫ్ రాష్ట్రఅధ్యక్షుడు ఐ.వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బాబురెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ముగ్గురు వినతులు చేయగా, ఖాళీలు సేకరించినా, ప్రభుత్వం వాటిని నోటిఫికేషన్లో ప్రకటించకపోవడాన్ని ఖండించారు. డీఈడీలకు మంచి చాన్స్! బీఈడీ అభ్యర్ధులను స్కూల్ అసిస్టెంట్ పోస్టులకే పరిమితం చేయటంతో సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టులకు పోటీ చాలా తగ్గనుంది. డీఈడీ పూర్తి చేసిన అభ్యర్ధులు మాత్రమే ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఖాళీల్లో ఎస్జీటీ పోస్టులు 6,244 ఉండగా బీఈడీ వారికి ఎస్ఏ పోస్టులు 1,849 మాత్రమే ఉన్నాయి. రాష్ట్రంలో డీఈడీ పూర్తి చేసిన వారికన్నా బీఈడీ చేసిన వారి సంఖ్య అత్యధికంగా ఉంది. డీఈడీ చేసిన వారు 70 వేలమంది కన్నా ఎక్కువగా లేరని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. అదే బీఈడీలకు వచ్చే సరికి నాలుగు లక్షల మందికి పైగా ఉన్నారని చెబుతున్నారు.