సార్ల దయ ఉంటేనే ‘యంత్రలక్ష్మి’
- లబ్ధిదారుల ఎంపికలో లోపించిన పారదర్శకత
- ఫోర్‌వీల్ డ్రైవ్ ట్రాక్టర్ కేటాయింపులో పైరవీలు
- నామమాత్రంగా వ్యవహరించిన జిల్లా సెలక్షన్ కమిటీ
- అసంతృప్తి వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
నిజామాబాద్‌అర్బన్/మోర్తాడ్: ‘యంత్రలక్ష్మి’ పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేయడంలో పారదర్శకత లోపించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు సూచించిన వారికే వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ట్రాక్టర్ యూనిట్లను కేటాయించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేజ్‌వీల్స్ అవసరం లేకుండా పంట పొలాలను దున్నడానికి ఫోర్‌వీల్ ట్రాక్టర్లను ఆయా కంపెనీలు తయారు చేశాయి.
వీటితో రహదారులు దెబ్బతినే అవకాశం ఉండదు. అందుకే వీటిని రైతుల కు ‘యంత్రలక్ష్మి’ పథకం కింద 50 శాతం సబ్సిడీతో అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని రైతాంగానికి 179 ఫో ర్‌వీల్ ట్రాక్టర్ యూనిట్లను కేటాయించారు. వీటి ధర రూ. ఎనిమిది లక్షల నుంచి రూ. తొమ్మిది లక్షల వరకు ఉంది. ట్రాక్టర్ ధరలో రైతు సగం చెల్లిస్తే మిగిలిన మొత్తం ప్రభుత్వం సబ్సిడీ రూ పంలో అందిస్తుంది.
‘అధికార’ అండదండలున్నవారికే
ఫోర్‌వీల్ ట్రాక్టర్ యూనిట్లను పొందడానికి దాదాపు 670 మం ది రైతులు మండల వ్యవసాయూధికారి కార్యాలయూలలో దరఖాస్తు చేసుకున్నారు. 18 మందికి ప్రోసీడింగులు అందించారు. ఇందులో అనర్హులు ఉండడం గమనార్హం. రైతులు ఇచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి జేడీఏ కార్యాలయానికి పం పించారు. వాటిని జిల్లా సెలక్షన్ కమిటీ పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు సూచించినవారిని సెలక్ష న్ కమిటీ ఎంపిక చేసిందని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.
ఫోర్‌వీల్ ట్రాక్టర్ యూనిట్ల కేటాయింపు పారదర్శకంగా జరుగలేదని అధికార పార్టీ అండదండలు ఉన్న వారికే యూనిట్లను కేటాయించారని చెబుతున్నారు. పారదర్శకంగా ఎంపిక జరిగి ఉంటే అర్హులకు ట్రాక్టర్ యూనిట్లు దక్కేవని అభిప్రాయం వ్య క్తం చేస్తున్నారు. ఫోర్ వీల్ ట్రాక్టర్‌ల యూనిట్ల కేటాయింపు విషయూన్ని ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ స ర్వసభ్య సమావేశంలో ఎంపీపీలు, జడ్‌పీటీసీ సభ్యులు ప్రశ్నించారు. అధికార పార్టీకి సంబంధించినవారికే ట్రాక్టర్ యూనిట్లను కేటాయించారని వివరించారు. అపుడు వ్యవసాయశాఖ మంతి పోచారం శ్రీనివాస్‌రె డ్డి స్పందించి భవిష్యత్తులో అర్హులైన అందరికి ట్రాక్టర్ యూనిట్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
అనర్హులే లబ్ధిదారులు
ప్రజాప్రతినిధులు సైతం తాము చెప్పిందే వేదంగా సాగాలంటున్నారు. ఆయా నియోజకవర్గాలలో సబ్సిడీ యంత్రాలకు అర్హుల ఎంపికలో తాము సిఫార్సు చేసిన వారినే అర్హులుగా గుర్తించాలని అధికారులకు ఆదేశిస్తున్నారు. దీంతో ‘యంత్రలక్ష్మి’ అర్హుల జాబితా సిఫార్సు జాబితాగా మారింది. సరైన రైతులకు ట్రాక్టర్లు అందక ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. మొదటి దశలో 150 ట్రాక్టర్లను అందించాల్సి ఉంది. రెంజల్ మండలంలో ఓ వైద్యుడు యంత్రలక్ష్మిలో భాగంగా ట్రాక్టర్‌ను పొందాడు.
స్వయంగా జిల్లా పరిషత్ సమావేశంలో సంబంధిత ఎంపీపీ కూడా ఈ విషయంలో వెలుగులోకి తీసుకవచ్చారు. రాజకీయ పార్టీ నాయకు లు, ప్రజాప్రతినిధులు ,వైద్యులు, వ్యాపారస్తులు ఇతరుల పం టలను, తప్పుడు పత్రాలు చూపించి 50 శాతం సబ్సిడీపైన ట్రాక్టర్లను పొందారు. మోర్తాడ్ మండలంలో యంత్రలక్ష్మిలో భాగంగా ట్రా క్టర్ల కోసం 26 దరఖాస్తులు వచ్చాయి. కానీ, జేడీఏ కార్యాలయానికి జాబితా రాగానే కేవలం ఏడుగురు మా త్రమే ఉన్నారు. మిగితవారిని మండల కేంద్రంలోనే తొలగిం చారు. ఇందులో ఉన్నవారు సైతం ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసిన వారేనని తెలిసింది. మోర్తాడ్ ఎంపీపీ దరఖాస్తు చేయించిన పేర్లు సైతం మాయమయ్యాయి.
విచారణ జరపాలి
ధర్పల్లి మండలంలో ఇద్దరు వ్యాపారస్తులు ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. వీరు ఇతర రైతులకు వాటిని అద్దెకు ఇవ్వడం గమనార్హం. నిజామాబాద్ మండల కేంద్రం లో యంత్రలక్ష్మికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఓ ప్రజాప్రతినిధి వద్దే కొనసాగింది. స్వయంగా ఆయనే పరిశీలించి ఇచ్చిన దరఖాస్తులను ఎంపిక చేశారు. నిజాం సాగర్ మండలంలో అసలు వ్యవసాయభూమి లేని వారు ట్రాక్టర్లను పొందారు. మండల స్థాయిలో ట్రాక్టర్లు పొందినవారిలో స్థానిక నేతలూ ఉన్నారు. అధికారులు చె ప్పిన దానిని ఏమాత్రం పట్టించుకోకుండా, తాము చెప్పిన వారికే ఇవ్వాలంటూ ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెచ్చారని సమాచారం. ఉన్నతాధికారులు విచారణ చేపడితే అర్హులకు న్యాయం జరిగే అవకాశం ఉంది.