
జీరో బేస్డ్ బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి జీరో బేస్డ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అందుకే బడ్జెట్ ప్రతిపాదనలను మళ్లీ తయారుచేయాలని అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. మూస పద్ధతికి భిన్నంగా జీరో బేస్డ్ (గత బడ్జెట్ అంచనాలతో సంబంధలేకుండా) బడ్జెట్ తయారీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అందుకు వీలుగా పథకాలన్నింటినీ పునఃసమీక్షించాలని రాష్ట్ర మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ భేటీలో తొలుత బడ్జెట్ తయారీపైనే చర్చ జరి గింది. అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులకు సీఎం పలు కీలకమైన సూచనలు చేశారు.
పాత బడ్జెట్‌తో సంబంధం లేకుండా ప్రతీ పథకాన్ని, ప్రతీ పద్దును పరిశీలించాలని సూచిం చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది అవసరమో, ఏదనవసరమో సమీక్షించుకోవాలని ఆదేశిం చారు. దానికి అనుగుణంగా ప్రతిపాదనలను రూపొందించాలన్నారు. వారంలోగా అన్ని శాఖలు కొత్త ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు పంపించాలని గడువు విధించారు. ఆ తర్వాత శాఖల వారీగా తాను సమీక్ష నిర్వహిస్తానని, మార్చిలో బడ్జెట్ సమావేశాలుంటాయని సీఎం చెప్పారు. దుబారా తగ్గించడంతోపాటు ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టే పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. ఎక్కువ పద్దులుండటం వల్ల బడ్జెట్ గందరగోళంగా ఉంటోం దని అభిప్రాయపడ్డారు.
ఏటేటా మూస బడ్జెట్‌లన్నీ వాస్తవాలకు దూరంగా ఉంటున్నాయనే ఉద్దేశంతో వాస్తవికతకు దగ్గరకు తెచ్చేలా ప్రయత్నం జరుగుతోందని అన్నారు. అన్ని శాఖల మం త్రులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, హెచ్‌వోడీలు ప్రతిపాదనల తయారీలో పాలుపంచుకోవాలని ఆదేశించారు. ప్రతి పద్దును పరిశీ లించి ఏయే పథకాలను కొనసాగించాలి.. వేటిని పక్కనబెట్టాలి. ప్రభుత్వం ఎంచుకున్న లక్ష్యాలకు అనుగుణంగా వేటిని ప్రతిపాదనల్లో పొందుపరచాలో పక్కాగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.