
సాక్షి, హైదరాబాద్: పోలీస్ సిబ్బందికి ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. గతంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన యూనిఫాం అలవెన్స్ పెంపునకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్.శివశంకర్ మంగళవారం విడుదల చేశారు. ప్రస్తుతం సిబ్బందికి ఏడాదికి రూ.3,500 యూనిఫాం అలవెన్స్ చెల్లిస్తున్నారు.
సీఎం నిర్ణయంతో ఇక నుంచి రూ.7,500 చెల్లించనున్నారు. అలవెన్స్ పెంచడంపై పోలీస్ సిబ్బంది, అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఉత్తర్వులు వెలువడేందుకు కృషిచేసిన డీజీపీతో పాటు ఇతర అధికారులకు పోలీస్ అధికారుల సంఘం కృతజ్ఞతలు తెలిపింది. పోలీస్ శాఖలోని గ్రేహౌండ్స్, స్పెషల్ బ్రాంచ్, సీఐడీ, స్పెషల్ ఇంటెలిజెన్స్ బృందాల్లో పనిచేస్తున్న సిబ్బంది మినహా మిగతా వారు పెంచిన యూనిఫాం అలవెన్స్‌ను పొందనున్నారు.