సాహో: కాలి బూడిదైనా తిరిగొస్తా | Sujith has Released the Third Poster From the Movie Saaho | Sakshi
Sakshi News home page

సాహో: కాలి బూడిదైనా తిరిగొస్తా

Published Wed, Aug 7 2019 7:05 PM | Last Updated on Wed, Aug 7 2019 7:23 PM

Sujith has Released the Third Poster From the Movie Saaho - Sakshi

భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సాహో. ప్రభాస్‌, శ్రద్ధా కపూర్‌లు జోడీగా నటించారు. ఈ సినిమాలోని పాత్రల పోస్టర్లను దర్శకుడు సుజీత్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పెడుతున్నాడు. మొన్న అరుణ్‌ విజయ్‌, నిన్న నీల్‌ నితిన్‌ ముఖేశ్‌ల పోస్టర్లను రిలీజ్‌ చేసి సినిమా మీద హైప్‌ క్రియేట్‌ చేసిన దర్శకుడు ఈ రోజు మరో క్యారెక్టర్‌ బాలీవుడ్‌ నటుడు చుంకీ పాండే పోస్టర్ను సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేశాడు. సినిమాలో దేవరాజ్‌ పాత్రను పోషించాడంటూ ‘‘కాలి బూడిదైనా తిరిగొస్తా’’ అనే అర్థం వచ్చే క్యాప్షన్‌ను పెట్టాడు. ఈ నెల 30న ఈ చిత్రం విడుదలవుతుండగా, థియేట్రికల్‌ ట్రైలర్‌ను స్వాతంత్ర్య దినోత్సవం నుంచి ప్రదర్శిస్తారని సమాచారం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement