భారీ ఉగ్రకుట్ర భగ్నం | 10 Islamic State suspects held after sleuths bust terror modul | Sakshi
Sakshi News home page

భారీ ఉగ్రకుట్ర భగ్నం

Published Fri, Apr 21 2017 12:48 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

భారీ ఉగ్రకుట్ర భగ్నం - Sakshi

భారీ ఉగ్రకుట్ర భగ్నం

పోలీసుల అదుపులో 10 మంది ఐసిస్‌ అనుమానిత ఉగ్రవాదులు
ఏకకాలంలో ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌ సహా మరో 4 రాష్ట్రాల పోలీసుల దాడులు


ముంబై/లక్నో: దేశంలో ఉగ్రపేలుళ్లకు పన్నిన భారీ కుట్రను పోలీసులు, భద్రతా సంస్థలు భగ్నం చేశాయి. ఈ సందర్భంగా గురువారం ఢిల్లీతో పాటు మరో ఐదురాష్ట్రాల్లో పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించి 10 మంది ఐసిస్‌ అనుమానిత కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నలుగురిని అరెస్టు చేయగా... ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలపై మరో ఆరుగురిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ ప్రత్యేక పోలీసు విభాగం, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలకు చెందిన ఉగ్ర వాద వ్యతిరేక బృందాలు(ఏటీఎస్‌), ఆంధ్ర ప్రదేశ్, పంజాబ్, బిహార్‌ పోలీసు విభాగాలు ఈ భారీ అంతర్రాష్ట్ర సంయుక్త దాడుల్లో పాలుపంచుకున్నాయి.

 ముందస్తు సమాచా రంతో గురువారం ముంబ్రా(మహారాష్ట్ర), జలంధర్‌ (పంజాబ్‌), నర్కటియాగంజ్‌ (బిహార్‌), బిజ్నోర్, ముజఫర్‌నగర్‌ (యూపీ) లో పోలీసులు, ఉగ్రవాద వ్యతిరేక బృందాలు ఏకకాలంలో దాడిచేశాయి. ఐసిస్‌ ఖొరాసన్‌తో అనుబంధంగా పనిచేస్తున్న నలుగురు ఉగ్రవా దుల్ని అరెస్టు చేశాయి. ఉగ్రవాద కుట్రకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై వీరిని అరెస్టు చేసినట్లు యూపీ ఉగ్ర నిరోధక బృందం (ఏటీఎస్‌) ఐజీ అసీమ్‌ అరుణ్‌ తెలిపారు. అరెస్టైన వారికి ఐసిస్‌ ఖోరాసన్‌తో సంబంధాలున్నాయని, దేశంలో భారీ ఉగ్రదాడులకు వ్యూహాలు పన్నారని ఆయన తెలిపారు. ఐసిస్‌కు సంబంధించి ముఖ్యమైన పత్రాల్ని వారి నుంచి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

నోయిడాలో అనుమానితుల విచారణ
బిజ్నోర్‌ జిల్లాలో ముఫ్తీ ఫైజాన్, తన్వీర్‌లను అరెస్టు చేయగా, బిజ్నోర్‌కు చెందిన నజీమ్‌ షంషాద్‌ అహ్మద్‌(26)ను మహారాష్ట్ర థానే జిల్లా ముంబ్రా టౌన్‌షి‹ప్‌ ప్రాంతంలో పట్టుకునన్నట్లు అసీమ్‌ చెప్పారు. మరో ఉగ్రవాది ముజమ్మిల్‌ను పంజాబ్‌లోని జలంధర్‌లో అరెస్టు చేసినట్లు తెలిపారు. కాగా ముజమ్మిల్‌ జలంధర్‌లో రెండున్నరేళ్లుగా నివసిస్తూ టైలర్‌గా పనిచేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఐసిస్‌తో సంబంధాలపై మరో ఆరుగురిని అదుపులోకి తీసుకుని నోయిడాలో ప్రశ్నిస్తున్నట్లు ఏటీఎస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. లక్నో ఎన్‌కౌంటర్‌తో లింకు: ఈ దాడుల్లో కేంద్ర భద్రతా విభాగాలు కూడా కీలక పాత్ర పోషించాయని ఏటీఎస్‌ ఐజీ తెలిపారు. అరెస్టైనవారంతా ఇంటర్నెట్‌ ద్వారా ఒకరికొకరు అందుబాటులో ఉండేవారని చెప్పారు.

మార్చి 7న లక్నోలో జరిగిన ఎన్‌కౌంటర్‌ అనంతరం కొన్ని కీలక పత్రాల్ని స్వాధీనం చేసుకున్నామని వాటి ఆధారంగా మరో ఐదు రాష్ట్రాలకు విచారణ పరిధిని విస్తరించామన్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, బిహార్‌లకు ఐసిస్‌ నెట్‌వర్క్‌ విస్తరించిందని, ఈ రాష్ట్రాలకు చెందిన కొందరు ఐసిస్‌లో చేరినట్లు గుర్తించామ న్నారు. అనుమానిత ఉగ్రవాదుల వయసులు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటుందని, ఇంటర్నెట్‌లో దొరికే సమాచారంతో ప్రభావితమైనట్లు ఆధారాలు దొరికాయని యూపీ అదనపు డీజీ దల్జీత్‌ చౌదరి చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement