తెలంగాణలో భారీగా ఉద్యోగాల నియామకాలు | 15 thousand government jobs to be filled in telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో భారీగా ఉద్యోగాల నియామకాలు

Published Sat, Jul 25 2015 8:01 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

తెలంగాణలో భారీగా ఉద్యోగాల నియామకాలు - Sakshi

తెలంగాణలో భారీగా ఉద్యోగాల నియామకాలు

హైదరాబాద్: తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణలో భారీ ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను చేపడుతున్నారు. 15 శాఖల్లో 15 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఫైలుపై కేసీఆర్ సంతకం చేశారు.

అభ్యర్థులకు పదేళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చారు. మొదటి దశలో వ్యవసాయం, వైద్యశాఖ, మున్సిపల్, విద్యుత్, ఎక్సైజ్ శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోలీసు, అనుబంధ శాఖల్లో 8 వేల ఉద్యోగాలను, విద్యుత్ శాఖలో 2681, మిగిలిన శాఖలో 4300 ఉద్యోగాల నియామకాలకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement