కారును ఢీకొన్న ట్రక్కు. 16 మంది మృతి | 16 killed in road accident | Sakshi
Sakshi News home page

కారును ఢీకొన్న ట్రక్కు. 16 మంది మృతి

Published Tue, Feb 11 2014 10:21 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

16 killed in road accident

వేగంగా వస్తున్న లారీ, ఓ కారును ఢీకొనడంతో 16 మంది మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం పశ్చిమబెంగాల్లోని మాల్డా సమీపంలో గల కలౌడిఘి వద్ద 34వ నెంబరు జాతీయరహదారిపై సంభవించింది. ఉదయం 7.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో 15 మంది పురుషులు, ఓ బిడ్డ మరణించారు.

13 మంది అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు మాల్డా వైద్య కళాశాల ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత మరణించినట్లు అధికారులు తెలిపారు. బాధితులంతా మాల్డా పట్టణ సమీపంలోని సహాపూర్లో ఓ పెళ్లికి హాజరై, అక్కడి నుంచి ఉత్తర దీనాజ్పూర్ జిల్లాలోని రాయ్గంజ్ ప్రాంతంలోని తమ ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు. ఈ ప్రమాదం సంభవించిన తర్వాత జాతీయ రహదారిని మూసేశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement