మా అమ్మాయిని లాక్కెళ్లి గొంతు కోశాడు | 16-yr-old girl’s throat slit as she ‘resists sexual advance’ in East Delhi | Sakshi
Sakshi News home page

మా అమ్మాయిని లాక్కెళ్లి గొంతు కోశాడు

Published Mon, Jul 4 2016 10:57 AM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM

మా అమ్మాయిని లాక్కెళ్లి గొంతు కోశాడు

మా అమ్మాయిని లాక్కెళ్లి గొంతు కోశాడు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఘోరం జరిగింది. 20 ఏళ్ల యువకుడు 16 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారయత్నం చేశాడు. అమ్మాయి ప్రతిఘటించినందుకు గొంతుకోసి చంపేందుకు ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.

తూర్పు ఢిల్లీలో యమున ఖదర్ ప్రాంతంలో నివసిస్తున్న బాధితురాలు బహిర్భూమి కోసం వెళ్లగా, నిందితుడు ఆమె వెంటపడ్డాడు. ఈ విషయాన్ని బాధిత బాలిక కుటుంబ సభ్యులు గుర్తించారు. నిందితుడు తమ కుమార్తెపై అత్యాచారయత్నం చేశాడని, ఆమె అడ్డుకోవడంతో 100 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లి గొంతు కోసి పరారయ్యాడని బాధితురాలి తండ్రి చెప్పాడు. కుటుంబ సభ్యులు ఆమెను లాల్ బహుదూర్ శాస్త్రి ఆస్పత్రికి తరలించారు. ఆమెకు ప్రాణాపాయం తప్పింది.

ఉత్తరప్రదేశ్కు చెందిన నిందితుడు గతంలో బాధితురాలి ఇంటి పక్కన ఉండేవాడు. ఆర్నెళ్ల క్రితం బాధితురాలిని వేధించినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకపోవడం వల్లే మళ్లీ దాడిచేశాడని బాధితురాలి బంధువులు వాపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement