జైలు వ్యానులో ఖైదీల ఘర్షణ; ఇద్దరు మృతి | 2 prisoners killed in clash in moving jail van | Sakshi
Sakshi News home page

జైలు వ్యానులో ఖైదీల ఘర్షణ; ఇద్దరు మృతి

Published Tue, Aug 25 2015 8:18 PM | Last Updated on Wed, Aug 29 2018 7:10 PM

జైలు వ్యానులో ఖైదీల ఘర్షణ; ఇద్దరు మృతి - Sakshi

జైలు వ్యానులో ఖైదీల ఘర్షణ; ఇద్దరు మృతి

న్యూఢిల్లీ: తీహార్ ఖైదీల మధ్య తలెత్తిన ఘర్షణలో ఇద్దరు మృతి చెందిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేపింది. తీహార్ జైలు వ్యానులో ఈ ఘటన చోటుచేసుకుంది. రోహిణి కోర్టు నుంచి తీహార్ జైలుకు తరలిస్తుండగా మంగళవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. రెండు గ్రూపులుగా విడిపోయిన ఖైదీలు కదులుతున్న వ్యానులో పరస్పరం దాడులు చేసుకున్నారు.

గాయపడిన ఖైదీలను మంగోల్ పురిలోని మహావీర్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో పరాస్ గోల్డీ, ప్రదీప్ బోలా మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. వ్యానులో ఉన్న 9 మంది ఖైదీల్లో ఏడుగురు ఒక గ్రూపు, ఇద్దరు మరో గ్రూపుగా ఏర్పడి పరస్పరం దాడి చేసుకున్నారని చెప్పారు. ఈ ఘటనపై మంగోల్ పురి పోలీసుస్టేషన్ లో కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement