గూండాల్లా కొట్టుకున్న పోలీసులు | Are criminals inside or outside Tihar? Jail warders fight like goons | Sakshi
Sakshi News home page

గూండాల్లా కొట్టుకున్న పోలీసులు

Published Wed, Feb 3 2016 5:58 PM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM

గూండాల్లా  కొట్టుకున్న పోలీసులు - Sakshi

గూండాల్లా కొట్టుకున్న పోలీసులు

న్యూఢిల్లీ:  తీహార్  జైల్లో ఖైదీల మధ్య గ్యాంగ్ వార్ వార్తలు తరచుగా వినేవే. వారి  మధ్య ఘర్షణలు, హత్యలు సర్వ సాధారణమే. అయితే  జైల్లోని ఖైదీలకు కాపలాగా ఉండాల్సిన  వార్డెన్ల మధ్య వార్  అనేక ప్రశ్నల్ని లేవనెత్తింది. గత రాత్రి తప్పతాగి, గూండాల్లా చెలరేగిపోయారు. ఓ వాహనంలో రక్తమోడేలా కొట్టుకున్న ఈ దృశ్యాలు ఇపుడు ఇంటర్ నెట్లో హల్చల్ చేస్తున్నాయి.

జానక్పురి ఏరియాలో  స్థానికులందరూ చూస్తుండగానే  విండ్ షీల్డ్ మీద ఢిల్లీ పోలీసు స్టిక్టర్ ఉన్న కారుల్లో పోలీసులు పరస్పరం ఎగబడి కొట్టుకున్న వైనం పోలీస్ వ్యవస్థకే అవమానకరంగా నిలిచింది.  ఈ వ్యవహారంపై  స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు  గుర్తు తెలియని వ్యక్తి ఈ ఉదంతాన్ని మొత్తం వీడియో చిత్రీకరించి నెట్లో పెట్టాడు. దీంతో జైల్లో ఉండాల్సిన  నేరగాళ్లు బయట ఉన్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement