గుజరాత్లో యువతిపై సామూహిక అత్యాచారం | 20-year-old woman gang-raped by two youths | Sakshi
Sakshi News home page

గుజరాత్లో యువతిపై సామూహిక అత్యాచారం

Published Sun, Nov 24 2013 9:10 AM | Last Updated on Sat, Sep 2 2017 12:57 AM

20-year-old woman gang-raped by two youths

బనస్కాంతా జిల్లాలోని కత్వా గ్రామ సమీపంలో 20 ఏళ్ల యువతిని ఇద్దరు యువకులు కిడ్నాప్ చేసి ఆపై పలు మార్లు అత్యాచారం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం సట్మాల గ్రామంలోని తన ఇంటికి ఒంటరిగా వెళ్తున్న యువతిని మోటర్సైకిళ్లపై వచ్చిన ఇద్దరు యువకులు అటకాయించారు. బలవంతంగా మోటర్సైకిళ్లపై ఆమెను పొలాల్లోకి తీసుకు వెళ్లారు. అనంతరం ఆ యువతిని బంధించి రాత్రంతఆ పలుమార్లు అత్యాచారం చేశారు.

 

ఆ యువతి కిడ్నాపర్ల చెర నుంచి శనివారం తప్పించుకుంది. జరిగిన విషయాన్ని ఆమె తల్లితండ్రులకు తెలిపింది. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులు కత్వా గ్రామానికి చెందిన విష్ణుజీ ఠాకూర్ హక్కాజీ ఠాకూర్ అనే వ్యక్తులుగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులిద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు వివరించారు. వారిద్దరిని సాధ్యమైనంత త్వరగా అరెస్ట్ చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు. సామూహిక అత్యాచారానికి గురైన యువతిని ఆరోగ్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement