
అహ్మదాబాద్ : గుజరాత్‌లో 40 మంది ప్రయాణికులతో వెళుతున్నఓ బస్ బనస్కాంత జిల్లా అంబాజీ పట్టణం వద్ద బోల్తా పడింది. త్రిశూలియా ఘాట్ వద్ద వేగంగా దూసుకుచ్చిన లగ్జరీ బస్సు బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణీకులుండగా 18 మంది మరణించారు. ఘటనపై సమాచారం అందగానే 108 బృందంతో పాటు పోలీసులు ఘటనాస్ధలానికి చేరుకున్నారు. బస్సులో చిక్కుకున్న వారిని స్ధానికుల సహకారంతో పోలీసులు వెలుపలికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో 5 గురు వ్యక్తులు మరణించారని అధికారులు వెల్లడించారు. కాగా బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.
Comments
Please login to add a commentAdd a comment