కొత్తగా ముస్తాబైన హోండా సిటీ..ధర
న్యూఢిల్లీ: మోస్ట్ ఎవైటెడ్ 2017 హోండా సిటీ ఫేస లిఫ్ట్ మంగళవారం లాంచ్ అయింది. జపాన్ దిగ్గజ కార్ల కంపెనీ హోండా తన పాపులర్ కార్ సిటీ 2017 మోడల్‌ను భారత్‌లో విడుదల చేసింది. సి-సెగ్మెంట్ సెడాన్స్‌లో రారాజుగా కొనసాగుతున్న హోండా సిటీ తన సిక్త్స్ జనరేషన్ కార్లను కొత్తగా ఐదు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ కొత్త హోండా సిటీ కారును పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో వీటిని మార్కట్లో ప్రవేశపెట్టింది. కారు ధరలు రూ. .50 లక్షలు ) నుంచి ప్రారంభం కానున్నాయి. డిజైన్లో పెద్దగా మార్పులు చేయనప్పటికీ కొత్త హంగులతో ఎస్, ఎస్‌వీ, వి, వీఎక్స్, జెడ్ఎక్స్ పేర్లతో ఐదు వేరియంట్లలో ముస్తాబైంది. బేస్ పెట్రోల్ ఇంజీన్ కారు ధరనురూ. 8.49 లక్షలు(ఢిల్లీ ఎక్స్ షోరూం) గాను, టాప్ ఎండ్ డీజిల్ వేరియంట్ ధరను రూ. 13.56లక్షలు(ఢిల్లీ ఎక్స్ షోరూం) గా కంపెనీ నిర్ణయించింది. ఎస్, ఎస్‌వీ, వీఎక్స్, జెడ్ఎక్స్ పేర్లతో ఐదు వేరియంట్లలో హోండా సిటీ లభించనుంది.
1.5 లీటర్ ఐ-డీటీఈసీ డీజిల్, 1.5 లీటర్ ఐ-వీటీఈసీ పెట్రోల్ ఇంజిన్లతో వస్తున్న సిటీలో సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, పెట్రోల్ ఇంజిన్ కారులో ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. పెట్రోల్ కారు లీటరుకు అత్యధికంగా 17.4 కిలో మీటర్ల మైలేజీ, డీజిల్ కారు లీటరుకు అత్యధికంగా 25.6 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. అయితే ఐదు గేర్ల సీవీటీ మోడల్ మాత్రం 18 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని పేర్కొంది.
ఫీచర్లు
కొత్త హోండా సిటీలో సరికొత్త ఎలీఈడీ హెడ్‌లైట్స్, టెయిల్ లైట్స్, ఫాగ్ ల్యాంప్స్, 2600 ఎంఎం వీల్ బేస్, 16 అంగుళాల డైమండ్ కట్ ఎల్లాయ్ వీల్స్ , అప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఆరు ఎయిర్ బాగ్ లతో పాటు ఆటోమేటిక్ ఎమర్జన్సీ లైట్స్, స్పాయిలర్‌పై అమర్చిన బ్రేక్ లైట్ మరోహైలెట్ అని చెప్పొచ్చు. జీపీఎస్ నావిగేషన్‌తో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. దీనిలో వీడియో ప్లేబ్యాక్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, వాయిస్ రికగ్నిషన్, రేర్ వ్యూ కెమెరా ఫీడ్,బ్లూ టూత్ కనెక్టివిటీ (ఆండ్రాయిడ్, ఐ వోఎస్) స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
పెట్రోల్ వేరియంట్ ధరలు
- ఎస్ రూ. 8.49 లక్షలు
- ఎస్ వీ రూ. 9.53 లక్షలు
- వీ రూ. 9.99లక్షలు
- వీ సీవీటీ రూ.11.53 లక్షలు
- వీఎక్స్ రూ. 11.64లక్షలు
- వీఎక్స్ సీవీటీ రూ. 12.84 లక్షలు
- జెడ్‌ఎక్స్ సీవీటీ రూ. 13.52 లక్షలు
డీజిల్ వేరియంట్ ధరలు
ఎస్‌వీ రూ. 10.75 లక్షలు
వీ రూ. 11.55 లక్షలు
వీఎక్స్ రూ. 12.86లక్షలు
జెడ్‌ఎక్స్ రూ. 13.56లక్షలు
కొత్త హంగులతో వచ్చిన ఈ హోండా సిటీ మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫోక్స్‌వ్యాగన్ వెంటో, మారుతీ సుజుకి సియాజ్, హుందై వెర్ణాకు గట్టి పోటీ ఇవ్వనుంది.