న్యూఢిల్లీ: 2019 సాధారణ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉండి... 2014 ఎన్నికల్లో ఓడిన 120 లోక్‌సభ స్థానాల్లో పట్టు పెంచుకోవాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. అందులో భాగంగా ఏప్రిల్ 6 నుంచి 14 వరకూ ఎనిమిది రోజుల పాటు బీజేపీ సీనియర్ నేతలు, మంత్రులు, ఎంపీలు ఆ నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నారు.
ఏప్రిల్ 6 బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం కాగా.. ఏప్రిల్ 14 బీఆర్ అంబేడ్కర్ జయంతి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్‌లో, సీనియర్ నేతలైన రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీలు కోల్‌కతా సౌత్, బెంగళూరు రూరల్, నిజామాబాద్‌ల్లో పర్యటించి బహిరంగ సభల్లో పాల్గొంటారు.
ఓడిన స్థానాలపై బీజేపీ గురి
Published Tue, Apr 4 2017 8:57 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement