రామేశ్వరం: శ్రీలంక జలశయాల్లోకి చేపల వేటకు వెళ్లిన మరో 22మంది తమిళ జాలర్లను శ్రీలంక నావికాదళం అరెస్ట్ చేసింది. పుదుకొట్టాయి పాల్క్ జలసంధి వద్ద అక్రమంగా ప్రవేశించారనే నేపంతో మత్య్సకారులను శ్రీలంక నావికాదళం అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. వారితోపాటు ఆరు పడవలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. చేపల వేటకు వెళ్లిన మరో తమిళ జాలర్ల బృందాన్ని కూడా శ్రీలంక నావికదళ సభ్యులు పట్టుకునేందుకు యత్నించారు. అంతేకాకుండా వారి చేపల వలలను నాశనం చేశారు. 22మంది జాలర్లను శ్రీలంక నావీ అరెస్ట్ చేయడంపై తీరప్రాంతమైన పుదుకొట్టాయిలో ఉద్రిక్తత నెలకొన్నట్టు అధికారులు చెప్పారు.
ఈ నేపథ్యంలో గత కొన్ని నెలల క్రితం అరెస్ట్ చేసి, శ్రీలంక జైల్లో నిర్భందించిన నాగపట్నం, కరాయికల్, పదుకొట్టాయి జిల్లాలకు చెందిన 227మంది తమిళ జాలర్లను వెంటనే విడుదల చేయాల్సిందిగా మత్స్యకారుల సంఘం డిమాండ్ చేస్తోంది. లంక దాడులపై నిరసనగా వారంతా సమ్మెబాట పట్టారు. దీనిపై తమిళనాడు మత్స్యకారుల ప్రతినిధులు శనివారం ప్రధాని మన్మోహన్ సింగ్ను కలిశారు. ఈ సందర్భంగా నిర్బంధించిన జాలర్ల విషయమై లంక ప్రభుత్వంతో చర్చలు జరిపి తమిళ జాలర్లను విడుదలకు కృషిచేయాలని వారు ప్రధానిని కోరినట్టు సమాచారం.
రామేశ్వరంలో మరో 22మంది తమిళ జాలర్ల అరెస్ట్
Published Sun, Dec 29 2013 12:06 PM | Last Updated on Sat, Sep 2 2017 2:05 AM
Advertisement