ఈ హెల్మెట్‌ ధర వింటే గుండె గుబేలే! | 24-Karat Gold Darth Vader Helmet | Sakshi
Sakshi News home page

ఈ హెల్మెట్‌ ధర వింటే గుండె గుబేలే!

Published Mon, May 1 2017 7:50 PM | Last Updated on Tue, Sep 5 2017 10:08 AM

ఈ హెల్మెట్‌ ధర వింటే గుండె గుబేలే!

ఈ హెల్మెట్‌ ధర వింటే గుండె గుబేలే!

24 క్యారెట్ల నికార్సయిన బంగారంతో రూపొందించిన ఈ హెల్మెట్‌ ధర వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. దీని ధర సుమారు తొమ్మిది కోట్లు (1.4 మిలియన్‌ డాలర్లు).  సార్ట్‌వార్‌ సినిమాలోని డార్త్‌ వాదర్‌ పాత్ర స్ఫూర్తితో అతను ధరించే తరహా హెల్మెట్‌ను జపాన్‌కు చెందిన ‘జింజా తనకా’ జ్యువెల్లర్స్‌ సంస్థ దీనిని తయారుచేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన స్టార్‌వార్స్‌ సినిమా 40 ఏళ్లు పూర్తిచేసుకోవడం, తమ సంస్థ 125 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా 14.96 కిలోల బరువున్న ఈ ప్రత్యేకమైన హెల్మెట్‌ను జింజా తయారుచేయించింది. అంతేకాకుండా డార్త్‌ వాదర్‌ నాణెలను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ బంగారపు హెల్మెట్‌ ఈ నెల 4న టోక్యోలోని ‘జింజా’ ప్రధాన దుకాణంలో వేలానికి రానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement