4 సంవత్సరాల బాలుడు..ఓ ఇంటి దొంగ | 4 years old boy Chinese boy steals USD 3,264 from home to gamble | Sakshi
Sakshi News home page

4 సంవత్సరాల బాలుడు..ఓ ఇంటి దొంగ

Published Tue, Mar 11 2014 4:05 PM | Last Updated on Fri, Jul 12 2019 3:31 PM

4 years old boy Chinese boy steals USD 3,264 from home to gamble

బీజింగ్: నాలుగు సంవత్సరాల వయసు. ఇంట్లో వాళ్లు చెప్పింది విని బుద్ధిగా తరగత పాఠాలు నేర్చుకోవాల్సిన ప్రాయం అది. ఆ వయసులోనే చెడు మార్గం పట్టి..ఇంటి దొంగగా మారితే కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణించలేనిదే. ఈ తరహా ఘటనే చైనా రాజధాని బీజింగ్ కు సమీపంలోని షియాంగ్ లో చోటు చేసుకుంది. ఇంట్లో వాళ్లను బరిడీ కొట్టించిన ఒక బాలుడు 3,264 డాలర్లను కాజేశాడు.   స్నేహితులతో కలిసి జూదం ఆడేందుకు ప్రణాళిక రచించుకున్న ఆ బాలుడు  ఆ డబ్బును తన స్కూల్ బ్యాగ్ లో పెట్టుకున్నాడు. గతవారం ఇచ్చిన హోం వర్క్ ను పరిశీలించేందుకు టీచర్ ఆ బ్యాగ్ ను తీయగా ఆ బాలుని వద్ద పెద్ద మొత్తంలో డబ్బు కనబడింది. 

 

దీంతో నివ్వెరపోయిన ఆ టీచర్ స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా అసలు విషయ తెలిసింది. తన ప్నేహితులతో కలిసి గాంబ్లింగ్ ఆట ఆడేందుకు డబ్బును ఇంట్లోనుంచి అపహరించినట్లు బాలుడు తెలిపాడు. దీంతో వారు ఆ బాలుని తల్లి దండ్రులకు విషయాన్ని తెలియజేశారు. వ్యాపర పనుల్లో భాగంగా  దాచి పెట్టిన ఆ సొమ్మును కొడుకు దొంగిలించడంతో తల్లి దిగ్భ్రాంతికి గురైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement