నైజీరియాలోని ఈశాన్య ప్రాంత గ్రామాల నుంచి 60 మంది అమ్మాయిలు, 31 మంది అబ్బాయిలను ఇస్లామిక్ ఉగ్రవాదులు అపహరించారు. ఈ విషయాన్ని స్థానికులు నిర్ధారిస్తున్నా, భద్రతాదళాలు మాత్రం ఖండిస్తున్నాయి. ఏప్రిల్ 15వ తేదీన ఆ దేశంలో దాదాపు 200 మంది పాఠశాల విద్యార్థినులను ఉగ్రవాదులు అపహరించుకుని వెళ్లినా, ప్రభుత్వం సరిగా స్పందించకపోవడంతో అక్కడి సర్కారుతో పాటు సైన్యం మీద తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.
శనివారం నాడు నలుగురు గ్రామస్థులను చంపి మరీ అమ్మాయిలు, అబ్బాయిలను ఉగ్రవాదులు అపహరించుకు వెళ్లారని ఆ గ్రామ వాసి అజీ ఖలీల్ తెలిపారు. గ్రామాల్లోకి ఉగ్రవాదులు చొరబడి అఘాయిత్యాలు చేయకుండా అడ్డుకోడానికి ఏర్పాటుచేసిన గ్రామ కమిటీలో ఖలీల్ కూడా సభ్యుడు. ఈ కమిటీ సభ్యులు సాధారణ ఆయుధాలతో కొంతమేరకు గ్రామాలకు రక్షణ కల్పించగలుగుతున్నారు. గ్రామంలో చాలామంది ఉగ్రవాదుల భయంతో దాదాపు 25 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
60 మంది అమ్మాయిలు.. 31 మంది అబ్బాయిల అపహరణ
Published Tue, Jun 24 2014 4:51 PM | Last Updated on Sat, Sep 2 2017 9:20 AM
Advertisement