ఐక్యరాజ్యసమితి: భారతదేశంలోని టీనేజ్ ఆడపిల్లల్లో 77 శాతం మంది లైంగిక హింసకు గురవుతున్నారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. 15 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న ఆడపిల్లల్లో 77 శాతం మంది తమ భర్త లేదా భాగస్వామి వల్ల బలవంతంగా లైంగిక చర్యలకు అంగీకరించాల్సి వస్తోందని వెల్లడించింది. వీరిలో సగం మంది తమ తల్లిదండ్రుల వల్ల శారీరక హింసకు గురవుతున్నారని పేర్కొంది. యునిసెఫ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ విషయాలను ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.
చిన్నారులపై లైంగిక హింస పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. దక్షిణాసియాలో పెళ్లైన ప్రతి ఐదుగురిలో ఒకరు భాగస్వాముల వల్ల లైంగిక వేధింపులకు గురవుతున్నారని వెల్లడించింది. ముఖ్యంగా భారత్, బంగ్లాదేశ్‌ల్లో ఈ పరిస్థితి అధికంగా ఉందని పేర్కొంది.