అమ్మో వాటర్ ట్యాంకుల్లో ఇన్ని ప్రాణాంతక దోమలా!
అమ్మో వాటర్ ట్యాంకుల్లో ఇన్ని ప్రాణాంతక దోమలా!
Published Sat, Sep 3 2016 1:10 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM
న్యూఢిల్లీ : చికెన్ గున్యా, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులతో విల్లవిల్లలాడుతున్న దేశానికి మరో షాకింగ్ న్యూస్. 86 శాతం ప్రాణాంతక దోమలు మంచినీళ్ల ట్యాంకుల్లోనే ఉంటున్నట్టు ప్రభుత్వ స్టడీ గుర్తించింది. కుటుంబాలు మంచినీళ్లు నిలువ ఉంచుకునేందుకు టెర్రస్ పైన ఏర్పాటుచేసుకునే ట్యాంకులు, ప్లాస్టిక్ డ్రమ్స్, డిసర్ట్ కూలర్స్, ప్లవర్ పాట్స్, ఐరన్ కంటైనర్లు, కంట్రక్షన్ సైట్లలోనే ఎక్కువగా దోమలను ఉన్నట్టు ప్రభుత్వం రిపోర్టు పేర్కొంది. దోమ కాటుతో చికెన్ గున్యా, డెంగ్యూ వ్యాధులు దేశాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ వ్యాధులపై పోరాట నేపథ్యంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రిపోర్టు తయారుచేసింది. మంచి పారిశుద్ధ్యం, సమర్థవంతమైన అవగాహన, కమ్యూనికేషన్ కాంపెయిన్ల వల్ల ఈ ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చని రిపోర్టు సూచించింది. ఈ ఏడాది ఆగస్టు 31 వరకు 12,225 చికెన్ గున్యా కేసులు, 27,879 డెంగ్యు కేసులు నమోదైనట్టు అధికారిక తాజా డేటా పేర్కొంటోంది. ఈ కేసులు వచ్చే రెండు నెలల్లో మరింత పెరుగనున్నట్టు తెలిపింది..
ప్లాస్టిక్ డ్రమ్స్లో 41 శాతం, డిసర్ట్ కూలర్స్లో 12 శాతం, కంట్రక్షన్ సైట్స్లో ఎక్కువగా వాడే ఐరన్ కంటైనర్లలో 17 శాతం ప్రాణాంతక దోమలున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయంపై సీరియస్గా స్పందించిన ఆరోగ్య కార్యదర్శి, కేబినెట్ సెక్రటరీ పీకే సిన్హా రివ్యూ మీటింగ్ నిర్వహించారు. విజృంభిస్తున్న డెంగ్యూ, చికెన్ గున్యా కేసులను నిర్మూలించడానికి, నిరోధించడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపల్ అథారిటీలు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. మొబైల్ క్లినిక్స్ను వాడుకోవాలని, మెడిసిన్లు, డాక్టర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా హెల్ప్లైన్ సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. వచ్చే వారం ఈ వ్యాధుల నివారణపై ప్రభుత్వం డోర్ టూ డోర్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్టు సిన్హా తెలిపారు.
Advertisement
Advertisement