నటుడు జేవీ రమణమూర్తి కన్నుమూత
హైదరాబాద్ : ప్రముఖ నటుడు జేవీ రమణమూర్తి (84) కన్నుమూశారు. బంజారాహిల్స్ స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. జేవీ రమణమూర్తి ప్రముఖ నటుడు జేవీ సోమయాజులు సోదరుడు. ఆయన పూర్తి పేరు జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం లుకులాం గ్రామంలో జేవీ రమణమూర్తి జన్మించారు. 1957లో ‘ఎమ్మెల్యే’ సినిమాతో 24వ ఏట సినీరంగ ప్రవేశం చేసిన జేవీ రమణమూర్తి సుమారు 150 సినిమాల్లో నటించారు.
మాంగల్యబలం, బాటసారి, మరో చరిత్ర, సిరిసిరిమువ్వ, గోరింటాకు, గుప్పెండు మనసు, ఇదికథకాదు, శుభోదయం, ఆకలిరాజ్యం, సప్తపది, శుభలేఖ లాంటి హిట్ సినిమాల్లో నటిచారు. ఓ సినిమాలతో పాటు నాటక రంగంలో కొనసాగారు. 20 ఏట నుంచి ఏకధాటిగా 43 ఏళ్లపాటు గురజాడ కన్యాశుల్కం నాటకాన్ని స్వీయ దర్శకత్వంలో సుమారు వెయ్యి సార్లు ప్రదర్శించి అపర గిరీశంగా ప్రఖ్యాతిగాంచారు. ఆయనకు ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అబ్బాయిలు.