
‘ఆధార్ లీక్’పై సమాచారమివ్వండి
సీఐఎస్‌ను కోరిన యూఐడీఏఐ
న్యూఢిల్లీ:
దాదాపు 13 కోట్ల మంది ఆధార్ సమాచారం బహిర్గతం అయిందంటూ కొద్ది రోజుల క్రితం సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ(సీఐఎస్) పరిశోధన నివేదికలో వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై పూర్తి వివరాలను అందించాలని సీఐఎస్‌ను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఓ లేఖలో కోరింది.
అక్రమంగా సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకుంటే వారికి 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష విధించే అవకాశం ఉందని ఈ సందర్భంగా పేర్కొంది.