CIs
-
15మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 15మంది సీఐలకు పదోన్నతిపై డీఎస్పీలుగా పోస్టింగులు ఇచ్చారు. వీరి పదోన్నతులను ప్రభుత్వం ఆగస్టులో ఖరారు చేసింది. కాగా వారికి తాజాగా పోస్టింగులు ఇస్తూ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి: ఎస్.వహీద్ బాషా( సీఐడీ), ఎం.హనుమంతరావు(సీఐడీ), టీవీ రాధా స్వామి (ఎస్బీ, గుంటూరు), డి.శ్రీహరిరావు (ఏసీబీ), జి.రాజేంద్ర ప్రసాద్ (ఇంటెలిజెన్స్), బి.పార్థసారథి ( సీఎస్బీ, విజయవాడ), కె.రసూల్ సాహెబ్ (సీఐడీ), ఎం.కిశోర్ బాబు ( విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్), డీఎన్వీ ప్రసాద్ (ఇంటెలిజెన్స్), జి.రత్న రాజు ( పోలవరం), పి.రవిబాబు (ఇంటెలిజెన్స్), షేక్ అబ్దుల్ కరీమ్ (పీసీఎస్ అండ్ ఎస్), ఎస్. తాతారావు (విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్), కోంపల్లి వెంకటేశ్వరరావు(విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్), సీహెచ్.ఎస్.ఆర్.కోటేశ్వరరావు(ఏసీబీ). -
దిశ చట్టంపై తిరుపతి అర్బన్ సీఐల ప్రశంసలు
-
13 మంది సీఐలకు స్థానచలనం?
ఏలూరు అర్బన్ : ఏలూరు రేంజి పరిధిలో పనిచేస్తున్న 13 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లకు స్థానచలనం కలిగించనున్నట్టు తెలిసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పేరు ప్రస్తుత స్థానం బదిలీ స్థానం బి.నాగేశ్వరనాయక్ సీసీఎస్ కొవ్వూరు భీమడోలు ఎ.నాగమురళి ఏలూరు రూరల్ ఏలూరు వన్‌టౌన్ ఎన్.రాజశేఖర్ ఏలూరు వన్‌టౌన్ తాడేపలి్లగూడెం రూరల్ బి.శివశంకర్ రైల్వేస్ పామర్రు కృష్ణాజిల్లా డి.ప్రసాద్ పామర్రు కృష్ణాజిల్లా వీఆర్, కృష్ణా జిల్లా ఆకుల రఘు పదోన్నతి సీఐ, మచిలీపట్నం కృష్ణారావు డీసీఆర్బీ డీసీఆర్బీ తూర్పుగోదావరి పశ్చిమగోదావరి ఎం.రమేష్‌బాబు తూర్పుగోదావరి వీఆర్ పోలవరం బాలరాజు పోలవరం జంగారెడ్డిగూడెం శ్రీనివాస యాదవ్ జంగారెడ్డిగూడెం గణపవరం దుర్గాప్రసాద్ గణపవరం వీఆర్ ఏలూరు శివశంకర్ ప్రసాద్ విజయవాడ రైల్వే పామర్రు కృష్ణాజిల్లా దుర్గా ప్రసాద్ పామర్రు విజయవాడ రైల్వే ఇదే క్రమంలో మరికొందరు సీఐల బదిలీ ఖరారు చేస్తూ రెండు, మూడు రోజుల్లో మరో జాబితా విడుదల కానుందని తెలుస్తోంది. -
‘ఆధార్ లీక్’పై సమాచారమివ్వండి
సీఐఎస్ను కోరిన యూఐడీఏఐ న్యూఢిల్లీ: దాదాపు 13 కోట్ల మంది ఆధార్ సమాచారం బహిర్గతం అయిందంటూ కొద్ది రోజుల క్రితం సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ(సీఐఎస్) పరిశోధన నివేదికలో వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై పూర్తి వివరాలను అందించాలని సీఐఎస్ను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఓ లేఖలో కోరింది. అక్రమంగా సమాచారాన్ని డౌన్లోడ్ చేసుకుంటే వారికి 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష విధించే అవకాశం ఉందని ఈ సందర్భంగా పేర్కొంది. -
పోలీసుల ‘ఆట’విడుపు
వరంగల్ : కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియలో భాగంగా పది రోజులుగా అభ్యర్థులకు దేహదారుఢ్య, క్రీడాంశ పోటీలు నిర్వహిస్తున్నారు. సోమవారం జేఎన్ఎస్ స్టేడియంలో పరుగు పందెం నిర్వహించిన అనంతరం కాసేపు విరామం లభించడంతో ఈ ఎంపికల్లో విధులు నిర్వర్తిస్తున్న సీఐలు, ఎస్ఐలు క్రీడల్లో తమ ప్రతిభను కనబర్చేందుకు ఆసక్తి చూపారు. షాట్‌పుట్ వేయడంలో పలువురు పోటీ పడ్డారు. ఇది గమనించిన సీపీ సుధీర్‌బాబు షాట్‌పుట్‌లో బాల్ ఎక్కువ దూరం విసిరిన మొదటి ముగ్గురికి నజరానా ఉంటుందని ప్రకటించడంతో వారిలో ఉత్సాహం రెట్టింపైంది. మొదటి స్థానంలో సీఐ నరేందర్, రెండవ స్థానంలో స్టేషన్ ఘనపూర్ సీఐ కిషన్, మూడవ స్థానంలో మడికొండ ఎస్ఐ విజ్ఞాన్‌రావు నిలవగా సీపీ సుధీర్‌బాబు వారిని అభినందించారు. -
మోసాలపై సెబీ కొరడా...
ముంబై: మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) రూ.13,000 కోట్ల విలువైన 150 మోసపూరిత వ్యవహారాల గుట్టురట్టు చేసింది. తద్వారా ఇన్వెస్టర్ల నుంచి అక్రమంగా నిధుల సమీకరణ కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసింది. వీటిలో పబ్లిక్ ఇష్యూల ముసుగులో ఇన్వెస్టర్లను మోసం చేసిన కేసులు 100కు పైన ఉండగా, వీటి విలువ దాదాపు రూ.2,200 కోట్లు. ఇక 45 కేసులు అక్రమ కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ (సీఐఎస్). వీటి విలువ రూ.9,500 కోట్లు. బ్యాంకింగ్, ఆర్థిక సేవల్లో లోపాలు, చట్టాల్లో లొసుగులు వంటి అంశాలు దేశంలో ఇలాంటి మోసపూరిత కేసులు పెరిగిపోవడానికి కారణమని సెబీ సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు -
సీఐల బదిలీలపై ఉత్కంఠ
గుంటూరు, న్యూస్‌లైన్ : సీఐల బదిలీలపై గుంటూరు రేంజ్లో ఉత్కంఠ నెలకొంది. నెలరోజులుగా రేంజ్ పరిధిలో బదిలీలపై విస్తృత ప్రచారాలు కొనసాగుతున్నాయి. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో ఒకే సర్కిల్లో రెండేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న అధికారులతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐలు ఈ బదిలీల జాబితాలో ఉంటారనే ప్రచారం జరగడంతో పోలీస్‌వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. రేంజ్ పరిధిలో 155 మంది పైగా సీఐలు ఉండగా.. వారిలో 15 నుంచి 20 మందికి బదిలీలు జరగవచ్చని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు సీఐల పనితీరుతో పాటు ఆరోపణలపై కూడా నిశిత పరిశీలన సాగిస్తునట్లు సమాచారం. గత అనుభవాల దృష్ట్యా.. గత అనుభావాల దృష్ట్యా ఐజీ పీవీ సునీల్‌కుమార్ ఆచితూచి వ్యవహారిస్తున్నారు. ఆరోపణలకు తావులేకుండా తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. గత సెప్టెంబరు నెలలో రేంజ్ పరిధిలో 44 మంది సీఐల బదిలీలు జరిగాయి. ఈ బదిలీల్లో ముడుపులు చేతులు మారాయని పెద్దఎత్తున ఆరోపణలు వినిపించాయి. అప్పట్లో డీజీపీ వి.దినేష్‌రెడ్డి జోక్యం చేసుకుని బహిరంగ విచారణ జరిపించారు. అదనపు డీజీ హుడాచే ప్రత్యేక బహిరంగ విచారణ చేయించారు. ఆరోపణలు వాస్తమమేనని తేలడంతో అప్పటి ఐజీ హరీష్‌కుమార్ గుప్తాపై బదిలీ వేటుపడింది. ఆ తరువాత జరిగే బదిలీలు భారీస్థాయిలో ఉండవచ్చని అందరు ఆశించగా అత్యవసరంగా కావాల్సిన సర్కిల్ పరిధిలో 23 మంది సీఐలను బదిలీ చేసి సర్దుకున్నారు.గుంటూరు రేంజ్లో సీఐల పరిధిలోని బదిలీలు అంటే తెనే తుట్టె కదిపినట్లేనని అధికారవర్గాలు భావిస్తున్నాయి. తాజాగా జరిగే బదిలీల్లో ఈ సంఖ్య 15 నుంచి 20 వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. రెండు నెలల క్రితం 23 మంది సీఐలను బదిలీ చేశారు. రేంజ్ పరిధిలోని మూడు జిల్లాల్లో సీఐలను ఎస్హెచ్వోలుగా కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో నెలకు 200 కేసులు అధికం కావడంతో ఎస్హెచ్వోలుగా నియమించగా రేంజ్ పరిధిలో ఈ వీరి సంఖ్య 30పైగా ఉంది. ఖద్దరు ఒత్తిళ్లు... సీఐల బదిలీల వ్యవహారంలో ఉత్కంఠ కొనసాగుతోంది. మూడు జిల్లాల పరిధిలో ఖద్దరు మార్క్ ఒత్తిళ్లు పోలీసుశాఖపై అధికంగా ఉన్నట్లు సమాచారం. ఏకంగా కొందరు సీఐలు మంత్రులను అశ్రయించి కీలకమైన సర్కిల్లో పోస్టింగ్ కావాలంటూ వారి నివాసాల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. రాబోవు ఎన్నికల నేపథ్యంలో వారికి అనుకూలమైన, వారి సామాజికవర్గాలకు చెందిన వారినే బదిలీలో అవకాశం కల్పించాలని ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు చేస్తునట్లు సమాచారం. ఇప్పటికే ఉన్నతాధికారులు సీఐల సర్వీసు రికార్డులను పరిశీలించి జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం.