అమెరికా ప్యాకేజీల ఉపసంహరణపై నియంత్రణ సంస్థలకు సూచన
న్యూఢిల్లీ: అమెరికాలో ఉద్దీపన ప్యాకేజీల ఉపసంహరణ వల్ల భారత్‌పై ప్రతికూల ప్రభావాలు పడకుండా ముందస్తుగానే పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ని యంత్రణ సంస్థలకు కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం సూచించారు. ప్యాకేజీల ఉపసంహరణ ప్రస్తుతానికి వాయిదాపడటాన్ని ఒక అవకాశంగా మల్చుకు ని, దేశీయంగా స్థూల ఆర్థిక సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయాలని చెప్పారు.
గురువారం జరిగిన ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి (ఎఫ్‌ఎస్‌డీసీ) సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు పేర్కొన్నట్లు అధికారులు వివరించారు. ఎఫ్‌ఎస్‌డీసీ సమావేశంలో స్టాక్‌మార్కెట్స్ నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ యూకే సిన్హా, ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, బీమా రంగ నియంత్రణ సంస్థ చైర్మన్ టీఎస్ విజయన్, ఫార్వర్డ్ మార్కెట్స్ కమిషన్ చైర్మన్ రమేష్ అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో ఏకీకృత నియంత్రణ సంస్థ ఏర్పాటుపై ఆర్థిక రంగ సంస్కరణల కమిషన్ ఇచ్చిన సిఫార్సుల అమలు తదితర అంశాలపై చర్చించారు.
ముందస్తు చర్యలు అవసరం: చిదంబరం
Published Fri, Oct 25 2013 1:45 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement