'కొత్త తాలిబన్ చీఫ్ కూడా అక్కడే..'
న్యూఢిల్లీ: ప్రస్తుత తాలిబన్ చీఫ్ మన్సూర్ అక్తర్ కూడా పాకిస్థాన్లోనే ఉన్నాడని అఫ్గనిస్థాన్ ఉన్నతాధికారులు ఆరోపించారు. పాక్ అధికారుల కనుసన్నల మధ్యనే అతడు తిరుగుతున్నాడని, రాజధాని సమీపంలోనే తలదాచుకుంటున్నాడని పేర్కొన్నారు. పాక్ మాజీ రక్షణ శాఖ అహ్మద్ ముక్తార్ ఓ భారతీయ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్ ఖాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ గురించి పాకిస్థాన్కు ముందే తెలుసని, తమ దేశమే అతడికి ఆశ్రయం కూడా ఇచ్చిందని చెప్పిన విషయం తెలిసిందే.
ఈ వివరణపట్ల స్పందించిన అఫ్గనిస్థాన్ ఒసామా బిన్ లాడెన్ గురించి పాకిస్థాన్కు తెలుసని, ఆ దేశంలోనే లాడెన్ ఉన్నాడని వెంటనే చర్యలు తీసుకోవాలని తాము ముందునుంచే చెప్పామని పేర్కొంది. ఒక్క ఒసామానే కాకుండా ఆయన అనంతరం తాలిబన్ చీఫ్గా వచ్చిన ముల్లా ఒమర్ పాక్లోనే తలదాచుకున్నాడని, ప్రస్తుత తాలిబన్ చీఫ్ మన్సూర్ అక్తర్ కూడా అక్కడే ఉన్నాడని ఇప్పటికైనా పాకిస్థాన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.