అమెరికన్ భార్యను చంపి.. పేల్చేసుకున్న భర్త | Agra man kills American wife, blows himself up | Sakshi
Sakshi News home page

అమెరికన్ భార్యను చంపి.. పేల్చేసుకున్న భర్త

Published Fri, Feb 21 2014 1:24 PM | Last Updated on Thu, Apr 4 2019 3:48 PM

అమెరికన్ భార్యను చంపి.. పేల్చేసుకున్న భర్త - Sakshi

అమెరికన్ భార్యను చంపి.. పేల్చేసుకున్న భర్త

ఎక్కడో అమెరికా నుంచి వచ్చింది. ఆగ్రా అందాలను చూడాలని వచ్చి, అక్కడున్న ఓ ఆటోడ్రైవర్తో ప్రేమలో పడింది. ఎరిన్ వైట్ అనే అమెరికన్ పేరును కాస్తా కిరణ్ శర్మగా మార్చుకుని మరీ ఆ ఆటోడ్రైవర్ను పెళ్లి చేసుకుంది. చివరకు అతడి చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయింది. అచ్చం బాలీవుడ్ సినిమాను తలపించే ఈ సంఘటన ఆగ్రాలో జరిగింది. ఆమెను చంపిన తర్వాత తనను తాను పేల్చేసుకుని బంటీ శర్మ అనే ఆ ఆటోడ్రైవర్ చనిపోయాడు. అమెరికాలో సంఘసేవకురాలు అయిన ఎరిన్ వైట్ గత సెప్టెంబర్ నెలలో బంటీని పెళ్లి చేసుకుంది.

గురువారం సాయంత్రం తన ఆటోలోనే ఆమెను పొడిచి చంపేసి, రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని బయటకు విసిరేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్య తర్వాత తన ఇంటికి తిరిగి వచ్చి, గ్యాస్ సిలెండర్ వాల్వు తెరిచి, నిప్పు అంటించుకుని తనను తాను పేల్చేసుకుని అతగాడు మరణించాడు. పోలీసులు డాగ్ స్క్వాడ్తో రెండు సంఘటన స్థలాలకు వెళ్లారు. ఈ సంఘటన గురించి కేంద్ర హోం శాఖతో పాటు ఢిల్లీలోని అమెరికన్ రాయబార కార్యాలయానికి కూడా సమాచారం అందించారు.

ఇద్దరి మధ్య వ్యక్తిగత సమస్యలు రావడం వల్లే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గత కొన్ని నెలలుగా వీరిద్దరికి సమస్యలు ఉండటంతో ఫ్యామిలీ కౌన్సెలర్ వద్దకు కూడా వెళ్లినట్లు చెప్పారు. ఎరిన్ తనకు ఇంతకుముందు పెళ్లి కాలేదని అబద్ధం చెప్పినట్లు బంటీ ఆరోపించగా, అతడు తనపట్ల చాలా క్రూరంగా వ్యవహరించాడని, అతడికి కూడా ఇంతకుముందు ఒక పెళ్లయిందని ఆమె చెప్పింది. చనిపోయే రోజు కూడా ఆమె 'ఆగ్రా సుందర్ హై' అనే కార్యక్రమానికి సంబంధించి విలేకరులతో మాట్లాడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement