నీట్ తరహాలో ఇంజనీరింగ్‌లో ప్రవేశానికి కూడా ఒకే పరీక్షను పెట్టాలని కేంద్రం యోచిస్తోంది.
న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) తరహాలో ఇంజనీరింగ్‌లో ప్రవేశానికి కూడా ఒకే పరీక్షను పెట్టాలని కేంద్రం యోచిస్తోంది. ఇది కేంద్ర మానవ వనరుల శాఖ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఆధ్వర్యంలో ఈ నెలాఖరున జరగనున్న సమావేశంలో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఈ పరీక్షలోని మార్కుల ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు.