న్యూఢిల్లీ : పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు కేరాఫ్ ఢిల్లీగా మారాయి. తెలుగు వారందరి దృష్టి ఇప్పుడు పార్లమెంటుపై ఉంది. అసెంబ్లీ వ్యతిరేకించిన విభజన తీర్మానాన్ని పార్లమెంటులో పెట్టేందుకు యూపీఏ పెద్దలు పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద ఉన్న ఈ బిల్లు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వద్దకు చేరనుంది.
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును సోమవారం పార్లమెంటు ముందు పెడతారా..? లేక రేపటి దాకా వేచి చూస్తారా అన్నది అందరు గమనిస్తున్న విషయం. ఒక వేళ సభలో ప్రవేశపెట్టాలని భావిస్తే లోక్‌సభను ఎంచుకుంటారా.? లేక సేఫ్ సైడ్‌లో రాజ్యసభలో ప్రవేశపెడతారా అన్నదానిపై రకరకాల ఊహగానాలు వస్తున్నాయి. అయితే సీమాంధ్ర ఎంపీల నిరసనలతో రాజ్యసభ రెండుసార్లు వాయిదా పడింది.
అందరి దృష్టి పార్లమెంటుపైనే...
Published Mon, Feb 10 2014 12:08 PM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement
Advertisement